ప్రస్తుతం రోజు రోజుకి సరి కొత్త టెక్నాలజీలు అమలులోకి వస్తున్నాయి.. బైకులు, బస్సుల స్థానంలో  మెట్రో రైళ్లు కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఏకంగా కార్లు గాల్లో ఎగురుకుంటూ వెళ్లిపోతున్నాయి. ఇక రాబోయా రోజులలో   ట్రాఫిక్ జామ్ ఆకాశంలోనే ఉంటుంది. సింగపూర్‌కి చెందిన రెండు ప్రముఖ కంపెనీలు... తమ ఫ్లైయింగ్ టాక్సీలను రంగంలోకి  ప్రవేశపెట్టడం జరిగింది. అవి గాలిలో ఎగురుతూ... అందరిని ఆశ్చర్య పరుస్తున్నాయి. నిజానికి ఈ ఫ్లైయింగ్ టాక్సీల ఆలోచన దాదాపు 30 ఏళ్లు నుంచి  ఉన్నదే. చిన్న సైజు కారులో గాల్లో ఎగురుతూ వెళ్లాలి. అందుకు తక్కువ ఖర్చు ఉండాలి. బ్యాటరీ పవర్ ఎక్కువ సేపు రావాలి. ఇలా ఎన్నో కండీషన్లు ఫ్లైయింగ్ కార్ల కాన్సెప్ట్‌కి పెద్ద సవాళ్లుగా నిలవడం జరిగింది.


ఇక  కాలం మారుతుంటే... టెక్నాలజీ కూడా బాగా పెరిగిపోతుంది... ఇప్పటికి సైన్స్ ఫిక్షన్ కాస్తా నిజంగా మారిపోయింది. పవర్‌ఫుల్ బ్యాటరీలతో, సరికొత్త డిజైన్లలో, తక్కువ ఖర్చులో, ఎక్కువ క్లీన్ అండ్ సైలెంట్ మోడ్‌లో గాల్లో ఎగరేసుకుపోయే ఫ్లైయింగ్ టాక్సీలు అందుబాటులోకి రావడం జరిగింది. వచ్చే దశాబ్దాంతానికి ఎయిర్ టాక్సీల అమ్మకాల బిజినెస్ రూ.35వేల కోట్లకు పోతుంది అని అంచనా వేస్తున్నారు. 2030 నాటికి ఏటా 20 వేల ఫ్లైయింగ్ కార్లు అమ్ముతాము అనే భావనలో కంపెనీ వాళ్ళు ఉన్నారు.


సింగపూర్‌లో ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్ వరల్డ్ కాంగ్రెస్ అనే సదస్సు కూడా జరిగింది. ఇందులో బ్రిటన్‌కి చెందిన స్కైపోర్ట్స్ లిమిటెడ్ తన మోడల్ ఫ్లైయింగ్ టాక్సీ స్టేషన్‌ని ప్రదర్శించారు . అలాగే జర్మనీకి చెందిన వోలోకాప్టర్ జిఎంబిహ్ కూడా తన ఎలక్ట్రిక్ వెహికిల్‌ని ప్రదర్శించారు. ఈ రెండు టాక్సీల ఇంజినీర్లూ... అవి ఎలా పనిచేస్తాయి, ఉపయోపడతాయి అని పూర్తి వివరాలు తెలియచేసారు. 


ఈ టాక్సీలలో  ప్రయాణం చేయాలను కునే వారు... యాప్ ఓపెన్ చేసి... ఫలానా సిటీలో ఎక్కడి నుంచీ ఎక్కడికి వెళ్లాలో వివరాలు తెలియచేశాలి ఉంటుంది. అంతే... ట్రావెలర్ చెప్పిన టైమ్‌కి ఎగురుకుంటూ ఫ్లైయింగ్ టాక్సీ రావడం జరుగుతుంది. అది ఎక్కగానే... ఎక్కడికి చేర్చాలో అక్కడికి పైలట్ గమన్యానికి చేరుస్తాడు. అతి తక్కువ ఖర్చుతోనే ఈ ఫెసిలిటీ అందుబాటులోకి వస్తుందని ఆ రెండు కంపెనీలూ తెలియచేయడం జరిగింది.



మరింత సమాచారం తెలుసుకోండి: