మధ్యతరగతి బ్రతుకులు ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ ఏడు నక్షత్రాల హోటల్స్ చూసినట్లుగా ఫిలయ్యేలా ఉన్నాయి. మార్కెట్లోకి ఏదైన కొత్త మోడల్ వస్తువు వచ్చిందంటే సామాన్యుడు దాన్ని కొనాలంటే నెల నెల జీతం డబ్బులు దాచుకుని, లేదా అప్పుచేసి కొనే పరిస్దితి కనిపిస్తుంది. అదే డబ్బులున్న బాబులైతే క్షణాల్లో నచ్చిన వస్తువుని కొనేస్తారు. ఇకపోతే ఇప్పుడు మార్కేట్లో ఉన్న మోబెల్స్ ధరల్లో మంచి బ్రాండెడ్ ఫోన్ తీసుకోవాలంటే ధరలు అదిరిపోయేలా ఉన్నాయి. కాని సామాన్య మానవుడు సైతం అన్ని ఫీచర్స్ ఉన్న ఫోన్ కొనవచ్చు అదేలా అంటే కొన్ని కంపెనీలు ప్రస్తుతం మార్కెట్లో రూ.10 వేలలోపు ఎన్నో  ఫోన్లను అందిస్తున్నాయి. అదిరిపోయే ఫీచర్లున్న ఉన్న ఫోన్లు మీకోసం.


ప్రస్తుతం భారతదేశంలో ఉన్న మొబైళ్లలో ధరకు తగిన విలువను అందించే మొబై ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ షావోమి తాజాగా లాంచ్ చేసిన ​రెడ్ మీ నోట్ 8.. ఈ ఫోన్ ధర రూ.9,999గా ఉంది. ఇందులో 6.39 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే ఉంది. వాటర్ డ్రాప్ నాచ్ ను ఇందులో అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ ను ఇందులో అందించారు. ఇకపోతే వెనకవైపు నాలుగు కెమెరాలు ఇందులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మరో కెమెరాను, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలను ఇందులో అందించారు. సెల్ఫీల కోసం 13 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న కెమెరాను అందించారు. 4,000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీ కూడా ఈ ఫోన్ లో ఉంది. ఇది 28W ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది.


​రియల్ మీ 5 ఫోన్ ప్రారంభ ధర రూ.9,990గా ఉండగా. ఈ ఫోన్ లో 6.5 అంగుళాల స్క్రీన్ తో పాటుగా, ఇప్పుడు వచ్చే అన్ని స్మార్ట్ ఫోన్ల మాదిరిగానే ఇందులో కూడా వాటర్ డ్రాప్ నాచ్ ను అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ ద్వారా ఈ ఫోన్ పని చేస్తుంది. ఇందులో కూడా వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ ఉంది. ప్రధాన కెమెరా సామర్థ్యం 12 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మరో మూడు కెమెరాలు ఇందులో ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 13 మెగా పిక్సెల్ గా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని ఇందులో అందించారు.  10W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.


​వివో యూ10 ఫోన్ ధర రూ.8,990 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో 6.35 అంగుళాల హాలో ఫుల్ వ్యూ హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. ఇందులో కూడా వాటర్ డ్రాప్ నాచ్ ను అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ ను ఇందులో అందించారు. వెనకవైపు కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మరో రెండు కెమెరాలు కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 8 మెగా పిక్సెల్ గా ఉంది. ఇందులో 5,000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని అందించారు. 18W ఫాస్ట్ చార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.


రియల్ మీ 3 ప్రో ఫోన్ ధర ప్రారంభ ధర రూ.9,999గా ఉంది. ఇందులో 6.3 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. ఇందులో కూడా వాటర్ డ్రాప్ నాచ్ ను సెల్పీ కెమెరా కోసం అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 710 AIE ప్రాసెసర్ ను ఇందులో అందించారు. వెనకవైపు 16 మెగా పిక్సెల్, 5 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలు ఇందులో ఉన్నాయి. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 25 మెగా పిక్సెల్ గా ఉంది. ఇందులో 4,045 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని అందించారు. 20W VOOC 3.0 ఫాస్ట్ చార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.


మోటోరోలా వన్ మాక్రో ధర రూ.9,999 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో 6.2 అంగుళాల హెచ్ డీ+ మ్యాక్స్ విజన్ డిస్ ప్లే ఉంది. వాటర్ డ్రాప్ నాచ్ ను సెల్పీ కెమెరా కోసం అందించారు. హీలియో పీ70 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పని చేయనుంది. వెనకవైపు మూడు కెమెరా సెటప్ ఇందులో ఉంది. ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మరో రెండు కెమెరాలను ఇందులో అందించారు. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 8 మెగా పిక్సెల్ గా ఉంది. ఇందులో 4,000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని అందించారు. 10W ఫాస్ట్ చార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.


రెడ్ మీ 8 ప్రారంభ ధర రూ.7,999గా ఉంది. రెడ్ మీ 8లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆరా మిర్రర్ డిజైన్ ను ఇందులో అందించారు. 6.22 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను ఈ ఫోన్ లో అందించారు. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 439 ప్రాసెసర్ ను ఇందులో అందించారు. ఇందులో డ్యూయల్ కెమెరా ఫీచర్ ఉంది. 12 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలను వెనకవైపు అందించారు. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 8 మెగా పిక్సెల్ గా ఉంది. 5,000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీ రెడ్ మీ 8లో ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్ ను ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది.


శాంసంగ్ గెలాక్సీ ఎం30 ధర రూ.9,999 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే ఉంది. వాటర్ డ్రాప్ నాచ్ ను సెల్పీ కెమెరా కోసం అందించారు. ఎక్సోనిస్ 7904 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పని చేయనుంది. వెనకవైపు మూడు కెమెరా సెటప్ ఇందులో ఉంది. ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, 5 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మరో రెండు కెమెరాలను ఇందులో అందించారు. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 16 మెగా పిక్సెల్ గా ఉంది. ఇందులో 5,000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని అందించారు. 15W ఫాస్ట్ చార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: