ఈ మధ్యకాలంలో పండుగా వచ్చింది అంటే చాలు... అన్ని ధరలు ఒకేసారి తగ్గిపోతాయి. కానీ కొన్ని సార్లు మాత్రమే పండుగా రాకపోయినా భారీగా ధరలు తగ్గుతుంటాయి. అయితే ఈసారి ఏ ధరలు తగ్గాయి అని అనుకుంటున్నారా ? అదేనండి.. వివో బ్రాండ్ లో కొన్ని ఫోన్ల ధరలు భారీగా తగ్గాయి. 


వివో వై 91, వివో వై 91ఐ స్మార్ట్‌ఫోన్ ధరలు భారత్‌లో భారీగా తగ్గాయి. వివో వై 91 2జీబీ+32 జీబీ మోడల్ ధర రూ.8,990 ఉండగా, ఇప్పుడు రూ.500 తగ్గించి రూ.8,490కే అందుబాటులో తీసుకొచ్చారు. వివో వై91ఐ మోడల్ ధర రూ.7,490 ఉండగా రూ.6,990కి తగ్గించి అందుబాటులోకి తీసుకొచ్చారు. 


కాగా ఈ ఫోన్ లు అతి తక్కువ ధరతోనే అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ధరలు ఎందుకు తగ్గాయి అనేది ఇంకా తెలియలేదు. డిమాండ్ తక్కువ అయ్యి ధరలు తగ్గాయా ? అనేది తెలియాలి. కాగా ఈ ఆఫర్ ఎన్నిరోజులు ఉంటుంది అనేది ఇంకా తెలియలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: