కొన్నాళ్ల క్రితం నుండి ఇంటర్నెట్ ధరలు అందరికీ అందుబాటులోకి రావడంతో పాటు మెల్లగా అందరికీ ఇంటర్నెట్ వినియోగం పై కొంత వరకు అవగాహన పెరుగుతుండడంతో, పలు రకాల సోషల్ మీడియా మాధ్యమాలను వయో బేధం లేకుండా అందరూ వాడుతున్నారు. ఇక మన దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన సోషల్ మీడియా మాధ్యమంగా చాలావరకు వాట్సాప్ అన్నిటికంటే ఒకింత పైస్థాయిలో ఉంటుంది అని చెప్పక తప్పదు. ఓవర్ ఆల్ గా మన దేశం మొత్తం మీద దాదాపుగా 40 కోట్లమందికి పైగా యూజర్స్ ప్రస్తుతం వాట్సాప్ వాడుతున్నారు. ఇక స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా వాట్సాప్ ని తమ ఫోన్ లో ఇన్స్టాల్ చేసి వాడడం చేస్తున్నారు. 

ఎందుకంటే ఇటీవల పలు కంపెనీలు తమ కస్టమర్లను అలానే ఉద్యోగులను పలు వాట్సాప్ గ్రూపుల ద్వారానే అనుసంధానం చేస్తున్నాయి. అయితే కేవలం మెసేజస్ తో పాటు పలు రకాల ఫైల్స్ పంపుకునే వీలుండడం, అలానే ఇటీవల ప్రెమెంట్స్ కూడా వాట్సాప్ స్టార్ట్ చేయడంతో మన దేశంలో మెజారిటీ ప్రజలు దీనిని మరింత ఎక్కువగా నియోగిస్తున్నారు. అయితే అనూహ్యంగా ఇటీవల జరిగిన ఒక నీవేదికలో మనదేశంలో వాట్సాప్ వాడేవారు చాలావరకు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. అయితే ఆ నివేదిక లెక్కల ప్రకారం, అక్టోబర్ 26 నుంచి నవంబర్ 3 మధ్యకాలంలో భారతదేశంలో వాట్సప్ డౌన్‌లోడ్స్ 80 శాతం తగ్గినట్లు తేలింది. 

ఇటీవల ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్ పెగాసస్ భారత్‌ లోని ప్రముఖుల వాట్సప్‌లను హ్యాక్ చేసినట్లు వార్తలొచ్చిన విషయం దావాలంలా వ్యాప్తి చెందడంతో, చాలామంది యూజర్స్ కు వాట్సాప్ అంటే కొంత భయం పట్టుకుంది. దీంతో వాట్సప్‌‌ను ఉపయోగించడానికి భారతీయులు విముఖత వ్యక్తం చేస్తున్నారని నివేదిక చెప్తోంది. అది మాత్రమే కాక, మన దేశీయ సమాచార మాధ్యమంగా ఇటీవల మెల్లగా ప్రాచుర్యం పొందుతున్న టెలిగ్రామ్ కు యూజర్స్ మరింతగా పెరుగుతున్నారని కూడా ఈ నివేదిక తేల్చిందట. మరి ఈ నివేదికలో తేలిన షాకింగ్ లెక్కలను బట్టి చూస్తుంటే రాబోయే రోజుల్లో వాట్సాప్ కు ప్రత్యామ్నాయంగా మరిన్ని సమాచార మాధ్యమాలు రావడం, అవి కూడా మరింత వృద్ధి చెందడం వంటివి జరిగే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు టెక్ నిపుణులు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: