కొన్నేళ్ల క్రితం టెక్నాలజీ వంటివి మనకు అందుబాటులో లేని సమయంలో ఒక ఊరి నుండి ఎవరైనా వ్యక్తిని ఇక్కడి సమాచారం చేరవేసేందుకు మరొక చోటికి పంపించేవారు. అయితే మధ్యలో అతడి తిండి, దారి ఖర్చులు మొత్తం కూడా ఆ సమాచారం ఎవరిదైతే అవుతోందో వారే భరించేవారు. ఇక ఆ తరువాత మెల్లగా ఉత్తరాలు, టెలిగ్రామ్, అలానే ఆపై కాలంలో టెలిఫోన్ వంటివి రావడంతో మెల్లగా మనిషికి కొంత సులభమైన సమాచార సాధనాలు లభించాయి. ఇక నేటి కాలంలో అవి మరింత అడ్వాన్స్డ్ గా విస్తరించి సెల్ ఫోన్స్ గా రూపాంతరం చెంది, ప్రపంచంలోని ఏ మూల నుండి ఏ మూలకైనా క్షణాల్లో కమ్యూనికేట్ చేసేలా టెక్నాలజీ ఉద్భవించింది. 

అయితే ఇటువంటి సమాచార సాధనాలు మనకు మేలు చేసేవే అయినప్పటికీ, రాను రాను అవి మన మధ్య ఉన్న బంధాలు అనుబంధాలను మెల్లగా రూపుమాపుతూ మనుషుల మధ్య అంతరాలు పెంచుతున్నాయి. ఇక ఇటీవల కొందరైతే రోజులో మూడొంతులు పైగా టైముని తమ మొబైల్ తోనే గడుపుతూ అసలు తమ ఇంట్లోని వారు, అలానే ప్రక్కన వారు ఏమి చేస్తున్నారు అనే విషయాలను పట్టించుకోవడం పూర్తిగా మానేశారు అనేది ఒప్పుకుని తీరవలసిన విషయం. అయితే ఇటువంటి చర్యల వలన తల్లితండ్రులు తమ పిల్లలతో సైతం ఫ్రీగా ఆనందంగా గడపలేకపోతున్నారు. అంతలా ఈ మొబైల్ ఫోన్స్ మన మధ్య అంతరాలు సృష్టించాయి. అయితే ఇటువంటి వాటికి చెక్ పెడుతూ, తమిళనాడు ప్రభుత్వం ఒక సంచలనం నిర్ణయం తీసుకుంది. 

ఈనెల 14వ తేదీన బాలల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క విద్యార్థి తల్లితండ్రులు ఉదయం 7.30 నుండి రాత్రి 8.30 వరకు తమ మొబైల్ ఫోన్స్ ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టాలని ఒక ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు పలు పాఠశాలలకు సర్క్యూలర్ కాపీలను కూడా పంపిందట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్స్ అసోసియేషన్ తరపున జారీ అయిన ఈ ప్రకటన ద్వారా అయినా కనీసం తమ తల్లితండ్రులు పిల్లలతో సరదాగా 12 గంటలు గడుపుతారని అక్కడి విద్యా శాఖ ఈ విధమైన యోచన చేసిందట. అంతేకాక ప్రతి ఒక్క విద్యార్థి కూడా తమ తల్లితండ్రులతో వారు సెల్ ఫోన్స్ ఎక్కువగా వాడకుండా, వీలైతే ప్రతి సండే నాడు వాటిని పూర్తిగా దూరం పెట్టి తమతో సరదాగా గడిపేలా ఒత్తిడి తేవాలని సూచిస్తోందట. ఈ విధంగా కనుక చేసినట్లైతే రాబోయే రోజుల్లో మన పిల్లలతో మనకు మంచి అనుబంధం ఏర్పడుతుందని, లేదంటే వారు మన వల్ల పలు సమస్యలపాలవుతారని మానసిక నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు....!!   


మరింత సమాచారం తెలుసుకోండి: