బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ప్రారంభించబోతున్నారా? ఒక్క క్షణం ఆగండి. ఎందుకంటే ఇప్పుడు బ్యాంకు కన్నా పోస్టాఫీసు బెటర్. నిజ‌మండీ.. పోస్టాఫీసు అకౌంట్ వ‌ల్ల మిగిలిన బ్యాంక్ అకౌంట్స్‌తో పోలిస్తే బోలెడు లాభాలు. అలాగే పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ ద్వారా కూడా మీరు బ్యాంకు అకౌంట్‌ ద్వారా కలిగే ప్రయోజనాలన్నీ పొందవచ్చు. భారతీయ పౌరులు ఎవరైనా ఈ ఖాతాను తెరిచి బ్యాంకు ఖాతాలవలే లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. కేవలం 20 రూపాయలతో ఖాతాను తెరవచ్చు.


బ్యాంకు మాదిరిగానే పోస్టాఫీసు అకౌంట్‌కు కూడా డెబిట్ కార్డు ఇస్తారు. దాంతో మీరు అవసరమైనప్పుడు ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. పోస్టాఫీసు అకౌంట్‌లో దాచుకున్న డబ్బుకు బ్యాంకు కంటే అధిక వడ్డీ లభిస్తుంది. పైగా అకౌంట్‌లో ఎంత డబ్బు ఉందన్న ప్రాతిపదికతో సంబంధం లేకుండా 4 శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే మీ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్‌లో మీరు మినిమం బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోతే చార్జీలు చెల్లించాల్సిందే. కానీ.. అదే పోస్టాఫీసు అకౌంట్‌లో అయితే ఈ మినిమం బ్యాలెన్స్ గొడవే ఉండదు. మీ అకౌంట్‌లో జస్ట్ రూ.50 ఉంచితే చాలు.


ఒకవేళ మీకు చెక్ బుక్ కావాలంటే మాత్రం మీ అకౌంట్‌లో మినిమం రూ.500 ఉంచాలి. అదే విధంగా బ్యాంకు అకౌంట్ మాదిరిగానే పోస్టాఫీసులో కూడా సింగిల్ లేదా జాయింట్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. పోస్టాఫీసులో మీరు సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉంటే.. డెబిట్ కార్డుపై రోజుకు రూ.25 వేల వరకు నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. మ‌రియు పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లు కూడా ఇంట్లో కూర్చునే అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందో ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. అయితే ఖాతా తెరిచేందుకు అవ‌స‌మైన ఫారంను పోస్టాఫీసుకు వెళ్లి కానీ లేదా ఆన్‌లైన్‌లో పొంద‌వ‌చ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: