యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కరికీ తెలిసిన వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం. చేతిలో స్మార్ట్ ఫోన్, ఇంట్లో ల్యాప్ టాప్, స్మార్ట్ టీవీ, డెస్క్ టాప్ ఏది ఉన్నా.. అన్నిట్లో యూట్యూబ్ మాత్రం కామన్. వినోదానికి, విజ్ఞానానికి కేరాఫ్ అడ్రెస్. వాస్త‌వానికి యూట్యూబ్ తెలియ‌ని వారూ.. చూడ‌ని వారూ ఉండ‌రు. అయితే మొబైల్‌తోపాటు డెస్క్‌టాప్‌లో యూట్యూబ్‌ను వాడుతున్న యూజర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా ఆ సైట్‌ను గూగుల్ కొత్తగా తీర్చిదిద్దింది. దీంతో పాటు యూట్యూట్ కొత్త వెర్ష‌న్‌లో ప‌లు నూతన ఫీచర్లను కూడా అందిస్తున్నారు.


యూట్యూబ్‌ హోం పేజీలో ఉండే వీడియోలను ప్లే లిస్ట్ రూపంలో సేవ్ చూసుకుని తరువాత వీక్షించవచ్చు. ఇక వీడియోల కింది భాగంలో ఆ వీడియోలను క్రియేట్ చేసిన వారి చానల్ ఐకాన్లు కూడా కనిపిస్తాయి. దీంతో వీడియో క్రియేటర్ ఎవరనేది యూజర్లకు సులభంగా తెలుస్తుంది. అలాగే యూట్యూబ్‌లో ఇకపై వీడియోలకు చెందిన థంబ్ నెయిల్స్ పెద్దవిగా కనిపిస్తాయి. మ‌రియు వీడియో క్రియేటర్లు తమ వీడియోలకు పొడవైన టైటిల్స్ పెట్టుకోవచ్చు. 


అలాగే మొబైల్ ప్లాట్‌ఫాంపై యూట్యూబ్ వీడియోలలో ఇకపై సజెస్టెడ్ వీడియోలు కనిపించవు. కానీ ఆ ఫీచర్‌ను డెస్క్‌టాప్ యూట్యూబ్‌లో అలాగే ఉంచారు. అదే విధంగా యూట్యూబ్‌ వీడియోలను ప్రివ్యూలో హై రిజల్యూషన్‌లో చూడవచ్చు. ఇక యూజర్లు తాము చూసే వీడియోలకు చెందిన రిలేటెడ్ వీడియోలు తమ యూట్యూబ్ హోం పేజీలో కనిపించేలా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. కానీ ఈ ఫీచర్‌ను ఇప్పుడు అందుబాటులోకి రావ‌డం లేదు. ఈ ఫీచ‌ర్‌ను త్వ‌ర‌లోనే అప్‌డేటెడ్ వెర్షన్‌లో అందించ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: