టిక్ టాక్.. ఇప్ప‌డు దీనికి మించిన హాట్ టాపిక్ ఉండ‌దేమో. కేవ‌లం 15 సెకన్ల వీడియోను సృష్టించడానికి ఈ యాప్ ను ఉపయోగిస్తున్నారు. ఈ యాప్ పరిమాణం 72 MB. టిక్ టాక్ యాప్ 38 భాషలు భాషల్లో అందుబాటులో ఉంది. చైనీస్‌ ఇంటర్నెట్‌ టెక్నాలజీ కంపెనీ 'బైటీ డ్యాన్స్‌' టిక్‌టాక్‌ను రూపొందించింది. 2016లో డౌయిన్‌ పేరుతో ఇది చైనాలో విడుదలైంది. ఆ తర్వాత ఏడాదికి 'టిక్‌టాక్‌' పేరుతో అంతర్జాతీయ మార్కెట్లలోకి ఈ యాప్‌ ప్రవేశించింది. 2018 జూలైలో ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉంది. 


భారత్‌లో ఫిబ్రవరి-2019 నాటికి 24 కోట్ల మంది ఈ టిక్‌టాక్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ప్రతి రోజూ 1 బిలియన్ వీడియోలను వీక్షింస్తారు. దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్న వారంతా 18–35 ఏళ్ల లోపు వారవడం విశేషం. వారంతా కూడా టూ టైర్, త్రీటైర్‌ నగరాలకు చెందిన వారే అవడం మరో విశేషమని ‘కాలాగాటో’ వ్యాపార విశ్లేషణా సంస్థ తెలియజేసింది. అలాగే టిక్‌టాక్ వినియోగదారుల్లో అధిక జీతాలు అందుకునే వారు కాకుండా తక్కువ జీతాలు అందుకునే వారే ఎక్కువగా ఉండడం ఇంకో విశేషం. భారత టిక్‌టాక్‌ యూజర్లలో 52 శాతం మంది నెలకు 25 వేల రూపాయల లోపు సంపాదించేవారే.


అదే విధంగా,  ‘లైకీ, ఇన్‌స్టాగ్రామ్, హెలో, స్నాప్‌చాట్‌లకన్నా ఎక్కువగా యూజర్‌ సరాసరి 30 నిమిషాలపాటు టిక్‌టాక్‌కు కేటాయిస్తున్నారు. స్నాప్‌చాట్‌కు సరాసరి 9.5 నిమిషాలు మాత్రమే కేటాయిస్తున్నారు. అలాగే జియో కారణంగా ఇంటర్నెట్‌ ధరలు దిగివస్తున్న పరిస్థితుల్లో ‘టిక్‌టాక్‌’  రావడం దాన్ని సక్సెస్‌కు ఒక కారణమని చెప్పవచ్చు. గత సెప్టెంబర్‌ నెలలో ప్రపంచంలో అన్ని యాప్‌లకన్నా ఎక్కువగా టిక్‌టాక్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. వాటిలో 44 శాతం భారత్‌లోనే జరగడం కూడా విశేషం. సో.. దీని బ‌ట్టీ టిక్‌టాక్‌కు క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: