చంద్రయాన్ 2 ప్రయోగం చివరి నిమిషంలో ఫెయిలైన సంగతి తెలిసిందే. భారత దేశం యావత్తూ ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రయోగం ఆఖరి రెండు గంటల్లోఅంతా తల్లకిందులైంది. చంద్రునిపైకి వెళ్లిన ఆర్బిటార్ ఇంకా పని చేస్తున్నా.. రోవర్ విక్రమ్ జాడ మాత్రం ఇంకా దొరకలేదు. నాసా కూడా ప్రయత్నిస్తోంది.


చంద్రయాన్ -2 లో ల్యాండర్ తో సంబంధాలు కోల్పోవడానికి గల అసలైన కారణం తెలుసుకోవడానికి ఏర్పాటైన.. జాతీయ స్థాయి కమిటీ త్వరలో ఇస్రోకు నివేదిక సమర్పించనుంది. ప్రధానమంత్రి కార్యాలయం పరిశీలించిన తర్వాత ఆ నివేదికను బహిర్గతపరుస్తామని ఇస్రో తెలిపింది.   


ఈ నేపథ్యంలో మళ్లీ వచ్చే నవంబర్ లో మరోసారి ప్రయత్నించాలని నిర్ణయించింది. చంద్రయాన్ -2లో జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నించి పూర్తిస్థాయిలో విజయవంతం కాలేకపోయిన ఇస్రో వచ్చే ఏడాది మరోసారి ప్రయత్నించనుంది. వచ్చే ఏడాది నవంబర్  సరైన సమయం అయినందున... బహుశా అదే నెలలో ప్రయోగం ఉండొచ్చని ఇస్రో వర్గాలు తెలిపాయి.


ఈ మేరకు విక్రం సారాభాయి అంతరిక్ష కేంద్రం డైరెక్టర్  ఎస్  సోమనాథ్  అధ్యక్షుడిగా ఓ ఉన్నత స్థాయి కమిటీని ఇస్రో ఏర్పాటు చేసింది. చంద్రయాన్ -3 కోసం వచ్చే ఏడాది చివరి నాటికి నివేదిక అందించాలని ఈ కమిటీకి ఇస్రో మార్గ దర్శకాలను జారీ చేసింది. గతంలో చంద్రయాన్ -2 లో తలెత్తిన లోపాలపై మరింత దృష్టి సారించనున్నట్లు తెలిపాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: