ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చే వాట్సాప్ తాజాగా మరో ఫీచర్ ను అందుబాటులోకి తీసుకరావడానికి రంగం సిద్ధం చేసుకుంది. అయితే ఇంతకుముందు వచ్చిన ఫీచర్లలా కాకుండా ఈ ఫీచర్ బ్లాకింగ్ కి సంబంధించినది కావడం విశేషం. ఈసారి తీసుకువచ్చిన ఈ ఫీచర్ ఏమిటంటే ఇంతకు ముందు మీరు ఎవరినైనా బ్లాక్ చేస్తే వారి కాంటాక్ట్ ఓపెన్ చేసినప్పుడు మీరు వారిని బ్లాక్ చేసినట్లు ఓ నోటిఫికేషన్ లాగా చూపిస్తుంది. అంటే మీరు వారిని బ్లాక్ చేశారో లేదో కేవలం కాంటాక్ట్ ఓపెన్ చేశారో లేదో తెలుసుకోవచ్చు, అయితే మీరు ఎవరిని అయితే బ్లాక్ చేశారో వారికి మాత్రం ఈ నోటిఫికేషన్ మాత్రం కనిపించదు. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ 2.19.332 బీటా వెర్షన్ లో అందుబాటులోకి వచ్చింది. 


ఇంతక ముందు మీరు బ్లాక్ చేసిన వారి కాంటాక్ట్ ఓపెన్ చేసినప్పటికీ వారిని బ్లాక్ చేసిన సంగతి మీకు తెలిసేది కాదు. దీనికి కారణం మీ కాంటాక్ట్స్ లిస్ట్ లో ఉన్న ఇతర కాంటాక్ట్ ల మాదిరిగానే కనిపించేది. కానీ ఇప్పుడు మాత్రం దానికి సంబంధించి నోటిఫికేషన్ తరహాలో ముందే కనిపిస్తుంది. కాబట్టి బ్లాక్ చేసిన వారిని సులభంగా గుర్తు పట్టవచ్చు. అంతేకాకుండా బ్లాకింగ్ కి సంబంధించిన ఇంకో ఫీచర్ ని కూడా వాట్సాప్ అందుబాటు లోకి తీసుకువచ్చింది. 


ఇంకా అసలు విషయం ఏమిటంటే  మీ బ్లాక్ లిస్ట్ లో ఉన్న నంబర్లని కాంటాక్ట్స్, బిజినెస్ అని రెండు విభాగాలుగా విభజించారు. ఎందుకంటే ఈ మధ్య కొన్ని కంపెనీలు తమకు సంబంధించిన మార్కెటింగ్ ను వాట్సాప్ ద్వారా చేయడం మొదలు పెట్టాయి. అటువంటి అనవసరమైన మెసేజ్ లు తప్పించుకోవడానికి వాటిని బ్లాక్ చేసి పెట్టేస్తాము. అయితే ఆ కాంటాక్ట్స్, మీరు బ్లాక్ చేసిన వ్యక్తిగత కాంటాక్ట్స్ మొత్తం కలిసిపోయి మీకు కొంచెం గజిబిజిగా అనిపించవచ్చు. కాబట్టి వాట్సాప్ ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా మీరు బ్లాక్ చేసిన కాంటాక్ట్స్ బిజినెస్, పర్సనల్ అని రెండుగా విడిపోతాయి. పర్సనల్ విభాగంలో మీ వ్యక్తిగత కాంటాక్ట్స్, బిజినెస్ విభాగంలో కంపెనీలు విడివిడిగా వస్తాయి. కాబట్టి మీకు కావాల్సిన కాంటాక్ట్ ను సులభంగా గుర్తుపట్టవచ్చు.


ఇవి రెండూ ప్రస్తుతం బీటా వెర్షన్ లో మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అయితే వాట్సాప్ బీటా వెర్షన్ కు అందించిన ఫీచర్లను త్వరలోనే సాధారణ వినియోగదారులకు కూడా అందిస్తుంది కాబట్టి దానికి సంబంధించిన ఫీచర్లు అతి త్వరలో అందుబాటులోకి వస్తాయని చెప్పుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: