మీరు డిజిటల్ పేమెంట్స్ యాప్ పేటీఎం వాడుతున్నారా...? మీకు పేటీఎం కంపెనీ నుండి కేవైసీ పూర్తి చేయాలని పూర్తి చేయకపోతే మీ అకౌంట్ లోని నగదు ఫ్రీజ్ అవుతుందని మెసేజ్ వచ్చిందా...? ఒక్కసారి మీ పేటీఎం అకౌంట్ లోని నగదును చెక్ చేసుకోండి. సైబర్ నేరగాళ్లు, హ్యాకర్లు కొందరు పేటీఎం కస్టమర్లను టార్గెట్ చేసి లింక్ లను పంపుతున్నారు. పొరపాటున ఆ లింక్ క్లిక్ చేస్తే చాలు పేటీఎం ఖాతాలోని డబ్బులు మాయమయ్యే అవకాశం ఉంది. 
 
ఫోన్లకు  ఇలాంటి మెసేజెస్ లేదా కాల్స్ వస్తున్నాయంటే అవి ఫేక్ అని గుర్తించండి. పేటీఎం తమ వినియోగదారులను ఎప్పటికప్పుడు మెసేజ్ ల గురించి హెచ్చరిస్తూనే ఉంది. పొరపాటున లింక్ క్లిక్ చేస్తే లింక్ క్లిక్ చేసిన కొద్ది నిమిషాల్లోనే పేటీఎం ఖాతాలలోని డబ్బు మాయమయ్యే అవకాశం ఉంది. పేటీఎం కంపెనీ ప్రతినిధులెవ్వరూ కేవైసీ పూర్తి చేసుకోవాలని మెసేజ్ ల ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా చెప్పరనే విషయం గుర్తుంచుకోవాలి. 
 
పేటీఎం చీఫ్ విజయ్ శేఖర్ శర్మ పేటీఎం యూజర్లను అలర్ట్ చేస్తున్నారు. పేటీఎం కంపెనీ పేరుతో ఫేక్ మెసేజ్ లు సర్క్యులేట్ అవుతున్నాయని విజయ్ శేఖర్ శర్మ చెబుతున్నారు. పేటీఎం అకౌంట్ బ్లాక్ అవుతుందని వస్తున్న వార్తలను నమ్మవద్దని విజయ్ శేఖర్ శర్మ సూచించారు. పేటీఎం యూజర్లు పేటీఎం కంపెనీ ఎలాంటి యాప్స్ డౌన్ లోడ్ చేయమని మెసేజ్ లు పంపదనే విషయం గుర్తుంచుకోవాలి. లక్కీడ్రా పేరుతో కొందరు మోసగాళ్లు మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: