మేము గెలిస్తే.. తిండి, గుడ్డలే కాదు 'ఇంటర్నెట్' కూడా 'ఫ్రీ'గా ఇస్తాం!! ఏంటి ఇది అని అనుకుంటున్నారా ? అదేనండీ ఎన్నికల ప్రచారంలో ఈ మాట వినాల్సి వచ్చింది. కాలం మారుతుంది.. అవసరాలు మారుతున్నాయి.. ఒకప్పుడు కడుపు నిండటానికి ఆహారం ఒకటి చాలు అని అనుకుంటే.. తర్వాత బట్టలు ప్రతిరోజు అవసరమయ్యే రోజులు వచ్చాయి.. ఆ తర్వాత గూడు కూడా ప్రతిఒక్కరికి అవసరమయ్యింది. ఇది అంత పురాతన సమయంలోలెండి. 

 

ఇప్పుడు కాలం మారింది కాబట్టి తిండి, నీరు, బట్టలు, గూడు మాత్రమే కాదు ప్రతి గుడుకు ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఇంటర్నెట్ లేకపోతే జీవితంలో ఒక్కరోజు కూడా గడవదు.. ఉన్నవాళ్లు అయితే వైఫైలు, మధ్య తరగతి వారైతే మొబైల్ డేటా ఫ్యాక్ లు, ఇంకా లేని వారైతే కీప్యాడ్ మొబైల్ వాడేవారు.. కానీ భారత్ లో అంబానీ దయ వల్ల ప్రతి ఒక్కరికి కొన్ని సంవత్సరాల బట్టి ఫ్రీ ఇంటర్నెట్ అందించాడు. 

 

సిమ్ కూడా ఫ్రీ గా ఇస్తా అని దాదాపు రెండు సంవత్సరాలు ఫ్రీ ఇంటర్నెట్ అందించాడు అంబానీ. దీంతో ఇండియాలో డిజిటల్ వినియోగం తార స్థాయికి చేరింది. అయితే మన దేశానికి అంటే అంబానీ ఉన్నాడు కాబట్టి ఫ్రీ ఇంటర్నెట్ దొరికింది.. కానీ పాపం ఇంగ్లండ్ లో అంబానీ పుట్టలేదు కదా.. అందుకే తాజాగా ఇంగ్లండ్ లో తాము గెలిస్తే 2030 నాటికి ప్రతి ఇంటికీ ఉచితంగా బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ను అందిస్తామని లేబర్ పార్టీ ప్రకటించింది. దీనికోసం దేశంలోని బ్రాడ్ బ్యాండ్ మౌలికవసతులను జాతీయం చేస్తామని ప్రకటించింది.

 

దీంతో ఒక్కసారిగా ప్రపంచం మొత్తం ఇంగ్లాండ్ రాజీయాలపై లుక్ వేశారు. కాలం మారింది అని మీ ప్రచారంలోనే తెలిసిపోతుంది అంటూ కామెంట్లు భారీస్థాయిలో వస్తున్నాయి. కాలక్రమంలో ఇంటర్నెట్ కూడా ప్రాథమిక హక్కుల జాబితాలో చేరిపోయింది.. మంచి ప్రచారమే ఈసారి నుండి మేము కూడా ఫ్రీ ఇంటర్నెట్ ఆప్షన్ ఇస్తాము అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్థ్రాలు గుప్పిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో ఇంటర్నెట్ చుట్టూ కూడా రాజకీయాలు జరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి మన దేశానికి అయితే ఇప్పటికే రెండు సంవత్సరాలు ఫ్రీ ఇంటర్నెట్ వచ్చేసింది. ఈ విషయం అందరికి తెలిసిందే.. మరి ఇంకా జీవితాంతం ఫ్రీ ఇంటర్నెట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: