ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ47 ఉపగ్రహం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. నిప్పులు చిమ్ముతూ కార్టోశాట్-3 బుధవారం ఉదయం 9.28 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లింది. చంద్రయాన్-2 తర్వాత ఇస్రో ప్రయోగించిన తొలి ప్రయోగమిది. స్వదేశీ ఉపగ్రహం కార్టోశాట్ తో పాటు మరో 13 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ మోసుకెళ్లింది. 

 

కార్టోశాట్ పరిమితి ఐదేళ్లు. సైనిక అవసరాలు, ప్రకృతి విపత్తుల అధ్యయనం కోసం ఈ ప్రయోగం మొదలు పెట్టారు. దీనికి శత్రుదేశాల కదలికలను అతి దగ్గర నుంచి తీసే సామర్ధ్యం ఉంటుంది. 27 నిమిషాల వ్యవధిలోనే ఉపగ్రహాలను ఇస్రో కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో టీమ్ ఇస్రోకు అంతా శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.  చంద్రయాన్-2 తర్వాత మొదటి ప్రయోగం విజయవంతం కావడంతో యావత్ భారతదేశం ఆనందంలో మునిగి పోయారు.


 
1625 కిలోల బరువు ఉన్న కార్టోశాట్-3 ఉపగ్రహాన్ని ఇస్రో రూపొందించింది. పీఎస్ఎల్వీ సీ-47 రాకెట్ ద్వారా ఇస్రో 14 ఉపగ్రహాలను 509 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షంలోకి ప్రవేశ పెట్టడం జరిగింది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ సిరీస్ లో ఇది 49వ ప్రయోగం. షార్ నుంచి 74వ రాకెట్ ప్రయోగం. పీఎస్ఎల్వీ సీ-47 ను ఎక్స్ ఎల్(XL) తరహాలో రూపొందించారు.

 

 శ్రీహరి కోటలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ ఉపగ్రహాలను ప్రయోగించారు. హై రెజొల్యూషన్ ఇమేజింగ్ క్యాపబిలిటీ టెక్నాలజీ ద్వారా భూ ఉపరితల చిత్రాలను ఈ శాటిలైట్ తీస్తుంది. ఐదేళ్ల పాటు అంతరిక్షం నుంచి సేవలు అందించే కార్టోశాట్-3 రెండు వేల వాట్ల సామర్ధ్యం కలిగి ఉంది. ఈ ప్రయోగం తర్వాత మరో రెండు ఉపగ్రహాలను షార్ నుంచి డిసెంబర్ లో ప్రయోగించే అవకాశం ఉంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు  అందరు కూడా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: