భారత దేశంనకు చెందిన ముఖ్యమైన, అత్యంత కీలకమైన రక్షణ వ్యవస్థల్లో అనేక రకాలుగా మేటవేసిన సైబర్‌ భద్రత లోపాలను ఈ దాడి ఎత్తిచూపుతోంది. ‘డిట్రాక్‌ మాల్‌వేర్‌’ను ఉత్తర కొరియాకు చెందిన హ్యాకింగ్‌ ముఠాలు ఎక్కువగా వాడుతుంటాయి. ఈ ముఠాలు సమాచారాన్ని దొంగిలించి, దాని ఆధారంగా మరిన్ని సైబర్‌ దాడులకు ఎన్నో రకాల ప్రణాళికలు సిద్ధంగా ఉంచుకుంటున్నాయి. 

 

ఈ ‘మాల్‌వేర్‌’ను దక్షిణ కొరియాలోని ఆర్థిక సేవలు, బ్యాంకింగ్‌, రక్షణ వంటి రంగాలకు చెందిన కీలకమైన సమాచారాన్ని దొంగిలించేందుకు ‘హ్యాకర్లు’ ఉపయోగిస్తుంటారు. భారత్‌కు చెందిన బాబా అణు విజ్ఞాన పరిశోధన కేంద్రం (బార్క్‌) మాజీ ఛైర్మన్‌ ఎస్‌ఏ భరద్వాజ్‌ హ్యాకర్లనుంచి బురిడీ కొట్టించే ఇ-మెయిళ్లు తనకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఇటువంటి ఇ-మెయిళ్లు వచ్చినట్లు తెలియచేసారు. 

 

Image result for cyber crime

 

ఆయన భారత అణు విద్యుత్‌ సంస్థ సాంకేతిక సంచాలకుడు, థోరియం ఆధారిత ‘ఏహెచ్‌డబ్ల్యూఆర్‌ రియాక్టర్‌’ శాస్త్రవేత్త కూడా కావడంగమనించదగ్గ విషయం. ఉత్తర కొరియా దేశంలో కొంతకాలంగా ‘యురేనియం ఆధారిత అణు సాంకేతికత’ నుంచి ‘థోరియం ఆధారిత అణు సాంకేతికత’పై ఆసక్తి చూపిస్తోంది. దీంతో థోరియం ఆధారిత అణు సాంకేతికలో బలంగా ఉన్న భారత్‌ను అది లక్ష్యంగా చేసుకొని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నది.. థోరియం సాంకేతికతపై వివిధ రకాల పరిశోధనలు చేసే ఇతర దేశాల శాస్త్రవేత్తలు సైతం దీనిదృష్టిలో ఎక్కువగా ఉన్నారు. భారత్‌కు చెందిన మరో కీలక శాస్త్రవేత్త కూడా అనిల్‌ కకోద్కర్‌కు కూడా ఇటువంటి ఇ-మెయిళ్లు వచ్చినట్లు ఆ సంస్థ తెలియచేయడం జరిగింది.

 

ఆధునిక కాలంలో యుద్ధక్షేత్రాల పరిధి మరింత విస్తరించింది. ఇప్పటివరకు భూమి, నీరు, గాలి, అంతరిక్షాల్లో సాగుతున్న యుద్ధం ఇప్పుడు ‘సైబర్‌’ స్థాయికి చేరింది. భద్రతా విభాగాల్లో కీలక సమాచార చౌర్యానికి, ఆయా వ్యవస్థలను ధ్వంసం చేయడానికి, అంతరాయాలు సృష్టించడానికి సైబర్‌ దాడులు జరుగుతుంటాయి. ఈ దాడులకు అత్యధికంగా గురవుతున్న తొలి మూడు దేశాల్లో భారత్‌ సైతం ఒకటని ప్రముఖ సైబర్‌ భద్రతా సంస్థ ‘సైమాంటిక్‌’ సర్వేలో వెల్లడించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: