ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. గతంలో ఉన్న 777 రూపాయల ప్లాన్ ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. గతంలో ఈ ప్లాన్ అమలులో ఉండేది. కానీ కొన్ని కారణాల వలన బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ ను తొలగించింది. గతంలో బీఎస్ఎన్ఎల్ వినియోగించిన వినియోగదారులకు ఈ ప్లాన్ గురించి తెలిసే ఉంటుంది. 
 
ఈ మధ్య కాలంలో ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, జియో టారిఫ్ రేట్లను భారీగా పెంచిన విషయం తెలిసిందే. గతంలో ఉన్న రేట్లతో పోలిస్తే దాదాపు 40 శాతం వరకు టెలికాం కంపెనీలు రేట్లు పెంచాయి. ఇలాంటి సమయంలో గతంలో ఉన్న 777 రూపాయల ప్లాన్ పట్ల వినియోగదారులు ఆకర్షితులు అయ్యే అవకాశం ఉందని బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ ను అమల్లోకి తెచ్చినట్టు తెలుస్తోంది. 
 
గతంలో కూడా బీఎస్ఎన్ఎల్ కొన్ని ప్లాన్లను అమల్లోకి తీసుకొచ్చిన తరువాత కొంతకాలం నిలిపివేసింది. గతంలో ఉన్న ప్లాన్ నే బీఎస్ఎన్ఎల్ మరలా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినప్పటికీ ఈ ప్లాన్ తో కొన్ని ప్రయోజనాలు వినియోగదారులకు చేకూరే విధంగా బీఎస్ఎన్ఎల్ మార్పులు చేసింది. బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు ఈ ప్లాన్ ద్వారా 50 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 500 జీబీ డేటాను పొందవచ్చు. 
 
500 జీబీ డేటా వినియోగించుకున్న తరువాత డేటా స్పీడ్ 2ఎంబీపీఎస్ కు తగ్గుతుంది. ఈ ప్లాన్ గడువు ఆరు నెలలు. దేశంలోని ఏ నెట్ వర్క్ కు అయినా ఈ ప్లాన్ లోకి ఎంటర్ అయ్యేవాళ్లు ఉచితంగా అన్ లిమిటెడ్ కాల్స్ ను చేసుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: