మొబైల్స్ తయారీదారు రియల్‌మి డిసెంబర్ 17వ తేదీన తన నూతన స్మార్ట్‌ఫోన్ రియల్‌మి ఎక్స్2ను త్వ‌ర‌లోనే లాంచ్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఫోన్‌ను లాంచ్ చేయ‌డానికి ముందే రు.500 డిస్కౌంట్‌తో  కొనే స‌రికొత్త ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలోనే వినియోగ‌దారులు ఈ రోజు నుంచి 
డిసెంబర్ 16వ తేదీ లోపు రియల్‌మి సైట్‌లోకి లాగిన్ అయ్యి, అందులో ఉండే బూస్టర్ సేల్ పేజ్‌లోకి వెళ్లి రూ.1 వేయి డిపాజిట్ చెల్లించి ఫోన్‌ను బుక్ చేసుకోవచ్చు. 

 

ఈ క్రమంలో మిగిలిన బ్యాలెన్స్‌లోంచి రూ.500 డిస్కౌంట్ పోను వచ్చే మొత్తాన్ని డిసెంబర్ 17 నుంచి 24వ తేదీ లోపు చెల్లించాలి. ఈ క్రమంలో ఫోన్‌ను డిసెంబర్ 17వ తేదీ తరువాత డెలివరీ చేస్తారు. కాగా రియల్‌మి ఎక్స్2 ఫోన్‌లో ఫీచ‌ర్స్ ఇలా ఉన్నాయి.

 

- 6.4 ఇంచుల డిస్‌ప్లే

 

- ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 730జి ప్రాసెసర్

 

- 6/8 జీబీ ర్యామ్

 

- 64/128 జీబీ స్టోరేజ్

 

- డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 

 

- 64, 8, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు

 

- 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

 

- ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్

 

- డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ

 

- బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ

 

- 4000 ఎంఏహెచ్ బ్యాటరీ

మరింత సమాచారం తెలుసుకోండి: