ఈ మధ్యకాలంలో టెలికాం ఆపరేటర్లు వేరే నెట్ వర్క్ లకు చేసే కాల్స్ కు చార్జ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాలు ఇప్పటికే ఆ చార్జీలను వసూలు చేస్తున్నాయి. అయితే ఎయిర్ టెల్ మాత్రం అన్ని నెట్ వర్క్ లకు ఉచితంగా కాల్స్ చేసుకునే అవకాశం ఇచ్చి మార్కులు కొట్టేసింది. దీంతో ఎయిర్ టెల్ వినియోగదారులు ఏ నెట్ వర్క్ కు అయినా ఉచితంగా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఇక ఇవ‌న్నీ ప‌క్కన పెడితే.. తాజాగా భారతీఎయిర్‌టెల్ తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ తెలిసింది.

 

భారతీ ఎయిర్ టెల్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెడుతున్న వైఫై వాయిస్ కాల్స్ సౌకర్యం తొలి విడతగా న్యూఢిల్లీలోని కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని సంస్థ మంగళవారం ప్రకటించింది. ఈ సౌకర్యం కారణంగా ఎయిర్ టెల్ కస్టమర్లు సాధారణ వాయిస్ కాల్స్ మాదిరిగానే ఈ వైఫై కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఇతర నెట్ వర్క్స్ కు చెందిన 2జి, 3జి, 4జి, వీవోఎల్టీఈ, వైఫై వినియోగదారులకు కూడా కాల్స్ చేయవచ్చు.

 

ఎయిర్ టెల్ వినియోగదారులు రోమింగ్ సమయంలో కూడా వై-ఫై కాల్స్ చేసుకోవచ్చని, దీని కోసం కొత్త సిమ్ కార్డులను తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని సంస్థ ప్రకటించింది. అయితే అంతర్జాతీయ కాల్స్ ను ప్రస్తుతానికి అనుమతించడంలేదు. త్వరలోనే అన్ని హాట్ స్పాట్ లు, బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ లకు ఈ సౌకర్యాన్ని  కల్పించనున్నట్లు కూడా ఎయిర్ టెల్ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: