న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్) తో వాణిజ్యపరమైన ఏర్పాట్ల చేసుకున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన అంతర్జాతీయ క్లైంట్స్ కు చెందిన వాణిజ్య చిన్న ఉపగ్రహాలతో పాటు భారతదేశం యొక్క సరికొత్త రక్షణ ఉపగ్రహం రిసాట్ -2 బిఆర్ 1 ను ఈరోజు సాయంత్రం 3.25 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ లోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి ప్రయోగించింది. పిఎస్‌ఎల్‌వి కి ఇది 50 వ ప్రయోగం కాగా ఇలాంటి ప్రయోగం సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి  నిర్వహించడం ఇదే మొదటి సారి కావడం విశేషం.

 

రిసాట్ -2 బిఆర్ 1 ఉపగ్రహం భారతదేశం యొక్క రాడార్ ఇమేజింగ్ మరియు భూమిని పరిశీలించే ఉపగ్రహం. సుమారు 628 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని 37 డిగ్రీల వంపుతో 576 కిలోమీటర్ల తక్కువ భూ కక్ష్యలో ఉంచనున్నారు. ఈ ఉపగ్రహం సింథటిక్ ఎపర్చర్ రాడార్ సామర్థ్యాలను కలిగి ఉంది, ఇది రాడార్ నిఘాకి సంబంధించిన ఉన్నతమైన, అన్ని-వాతావరణ సమస్యలను తట్టుకోగలుగుతుంది. ఇది మేఘాల గుండా చొచ్చుకుపోతూ భూమిపై చిత్రాలను 35 సెం.మీ. దూరంలో ఉన్న చిత్రాలు కూడా తీయగలదు. 

 

దీనితో పాటు గా మరో 9 ఉపగ్రహాలను పిఎస్‌ఎల్‌వి సి-48 ద్వారా అంతరిక్షంలోకి పంపారు. జపాన్, ఇజ్రాయెల్, అమెరికా కు చెందిన 9 ఉపగ్రహాలను పిఎస్‌ఎల్‌వి సి-48 అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. పిఎస్‌ఎల్‌వి-సి 48 మిషన్‌లో క్యూపిఎస్-ఎస్ఎఆర్ మైక్రోసాటిలైట్‌లో జపాన్ చేసిన విప్లవాత్మక ఉపగ్రహ పరీక్ష సాంకేతికత అమర్చి ఉంది. 100 కిలోల సింథటిక్ ఎపర్చర్ రాడార్ ( మైక్రో సాటిలైట్ కోసం ఆల్-వెదర్, 24/7 భూ పరిశోధన గురించిన సేవలను అందించాలనే లక్ష్యం తో ఈ ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఈ ఉపగ్రహాలు రిమోట్ నిఘా ద్వారా భూమి యొక్క ఛాయా చిత్రాలని పంపనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: