అంగారక గ్రహంపై నీళ్ల జాడ గురించి చాలాకాలంగా శాస్త్రవేత్తలను వేధిస్తున్న ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించింది. ఇప్పటికే నాసా పంపిన క్యూరియాసిటీ రోవర్​, మార్స్​పై కలియతిరుగుతూ ఫొటోలు పంపుతూ రీసెర్చ్​లో ఓ చెయ్యి వేస్తోంది. అయితే, మార్స్​లో ఒకప్పుడు నీళ్లుండేవని, అవన్నీ ఇప్పుడు పోయాయని సైంటిస్టులు ఎప్పుడూ చెబుతున్న మాట. కానీ.. ఇప్పుడు ఆ మాట‌లు మారాయి. వారి సుదీర్ఘ పరిశోధనలకు ఫలితం లభించింది. తాజాగా మార్స్ గ్రహం మీద నీటి మంచు ప్రదేశాలను కనుగొన్నట్లు తెలిపింది. అది కూడా అంగారక గ్రహం మీద చాలా ప్రదేశాలలో నీటి మంచు నిక్షేపాలు ఉపరితలం కంటే ఒక అంగుళం తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. 

 

నాసా శాస్త్రవేత్తలే ఈ అంశాన్ని వెల్లడించారు. దీనికి సంబంధించిన మ్యాపులను కూడా విడుదల చేశారు. అలాగే `ఈ మంచును త్రవ్వటానికి మీకు బ్యాక్‌హో అవసరం లేదు. మీరు పారను ఉపయోగించవచ్చు` అని కాలిఫోర్నియాలోని నాసా యొక్క జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీకి చెందిన సిల్వైన్ పిక్యూక్స్ తెలిపారు. ఇక మార్స్​ అర్కడియా ప్లానిషియా హెమీస్ఫియర్​ వద్ద అంగుళం లోపలే ఐస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూపంలో నీళ్లున్నాయని తేల్చారు. అంతేగాకుండా రెండు అడుగుల లోతులోనూ నీళ్లు గడ్డకట్టి ఉన్నట్టు గుర్తించారు. ధ్రువాలతో పాటు మధ్య అక్షాంశాల వద్ద కూడా నీటి జాడను కనుగొన్నారు. 

 

కాగా, నాసా మార్స్​ రికనైసెన్స్​ ఆర్బిటర్​, మార్స్​ ఒడిస్సీ ఆర్బిటర్​లు తీసి పంపిన ఫొటోలు, సేకరించిన సమాచారం ఆధారంగా సైంటిస్టులు ఈ నిర్ధారణకు వచ్చిన‌ట్టు తెలుస్తోంది. చంద్రుడి లాగానే మార్స్​ మీద కూడా కొన్ని ప్రదేశాలు బతికేందుకు అనువుగా ఉండవని చెబుతున్నారు. మ‌రియుమార్టిన్ ధ్రువాలు మరియు మధ్య అక్షాంశాల అంతటా నీటి మంచు చాలా ఉందని పరిశోధనా పత్రం సూచిస్తుంది. వీటి మీద నాసా మరింత దృష్టి పెట్టాలనుకుంటున్నది. దీని ద్వారా నీటి మంచు యొక్క నిస్సార నిక్షేపాలు ఇంకా ఎంత మొత్తంలో ఉన్నాయో కనుగొనవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: