స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి రోజుకొక సరికొత్త ఆలోచనతో ముందడుగు వేస్తోంది. అద్భుత ఫీచర్స్ ఉన్న మొబైల్స్ ను సామాన్యులు కొనగలిగే ధరల్లో అందుబాటులోకి తెస్తుంది రియల్‌మి కంపెనీ అందుకే కంపెనీ పెట్టిన చాలా కొద్ది రోజుల్లోనే టాప్ 5 కంపెనీల లిస్టులో స్థానం సంపాదించింది. ఇక తాజాగా రియల్‌మి ఒక కొత్త యాప్ ను తీసుకొచ్చింది. దీని పేరు రియల్‌మి పేసా (Realme Paysa).

 

అప్లికేషన్ ద్వారా మీరు ఎటువంటి డబ్బులు చెల్లించకుండానే ఫ్రీ గా మీ సిబిల్ స్కోర్ ను తెలుకోవచ్చు. సిబిల్ స్కోర్ అంటే మీరు బ్యాంకుల్లో అప్పులు తీసుకుంటే వాటిని సక్రమంగా కడుతున్న దానిపై ఒక స్కోర్ ఉంటుంది దీన్నే సిబిల్ స్కోర్ అంటాం. మీకు బ్యాంకులో లోన్ కావాలంటే మీ సిబిల్ స్కోర్ 700 కు పైగా ఉండాలి. మీరు బయట సిబిల్ స్కోర్ ను పొందాలంటే సుమారు రూ 200 నుంచి రూ 500 వరకు ఖర్చు అవుతుంది. ఈ యాప్ ద్వారా ఫ్రీ గా సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు. 

 

ఇక మీరు ఈ యాప్ ద్వారా బిజినెస్ మరియు పర్సనల్ లోన్లు పొందవచ్చు. బిజినెస్ లోన్ అయితే రూ 10 కోట్ల వరకు, పర్సనల్ లోన్ అయితే రూ 10 లక్షల వరకు పొందవచ్చు. దీని కోసం మీ పేరు, చిరునామా, పాన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. పర్సనల్ లోన్ అయితే మీకు ఆదాయం ఏ విధంగా వస్తుందో తెలపాల్సి ఉంటుంది. శాలరీ ద్వారానా లేక బిజినెస్ ద్వారానా పేర్కొనాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎంటర్ చేసాక మీ అప్లికేషన్ ను సబ్మిట్ చేస్తే మీకు కంపెనీ నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చిన తరువాత లోన్ ప్రాసెస్ మొదలు అవుతుంది. ఇంకా ఈ యాప్ తో ఫోన్ రీఛార్జ్, టికెట్స్ బుకింగ్, ఆన్లైన్ పేమెంట్స్  చేయొచ్చు. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ యాప్ ను ఒకసారి ట్రై చేసి చూడండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: