వాట్సప్.. పరిచయం అక్కర్లేని ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న యాప్ ఇది.  ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ వినియోగదారులకు అందించడంలో వాట్సాప్‌ ముందంజలో ఉంటుంది. అయితే ఆన్‌లైన్‌ మెసేజింగ్‌ దిగ్గజ సంస్థ వాట్సాప్ అతి త్వరలో డార్క్‌ మోడ్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నది. వినియోగదారులు ఈ ఫీచర్‌ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. రాత్రి వేళ్లలో డార్క్ మోడ్‌లో వాట్సాప్ మెసేజ్‌లు తేలిగ్గా చూసుకునేందుకు వెసులుబాటుగా ఉంది. 

 

అలాగే రాత్రవేళ్లలో కళ్లకు శ్రమ తెలియకుండా చేసేందుకు వాట్సాప్ డార్క్‌మోడ్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆండ్రాయిడ్ వెర్షన్ రెడీ అయిందని, ఐవోఎస్ వెర్షన్ కూడా సిద్ధమవుతోందని వాట్సాప్ తెలిపింది. ఆండ్రాయిడ్ యూజర్లలో కొందరికి ఇప్పటికే డార్క్‌మోడ్ అందుబాటులోకి వచ్చిందని బ్రిటన్‌కు చెందిన ఇండిపెండెంట్ వెబ్‌సైట్ తెలిపింది. డార్క్‌మోడ్ వల్ల కళ్లకు  శ్రమ తప్పుతుంది. సాధారణంగా ఇంటర్నెట్‌లో సమాచారమంతా తెల్లని బ్యాక్‌గ్రౌండ్‌లో నల్లని అక్షరాల్లో ఉంటుంది. 

 

దీనివల్ల రాత్రివేళ కళ్లకు విపరీతమైన శ్రమ కలుగుతుంది. ఈ కారణంగా ఇప్పుడు వాట్సాప్ డార్క్‌మోడ్‌ను తీసుకొస్తోంది. ఇందులో నల్లని బ్యాక్‌గ్రౌండ్‌లో తెల్లని అక్షరాలు కనిపిస్తాయి. డార్క్‌మోడ్‌ వల్ల అక్షరాలు ప్రకాశవంతంగా బ్యాక్‌గ్రౌండ్‌ నలుపు రంగులోకి మారిపోతాయి. దీనివల్ల కళ్లకు అంతగా శ్రమ ఉండదు. అంతేకాక బ్యాటరీ కూడా ఎక్కువ సమయం వచ్చేందుకు అవకాశం ఉంటుంది.   

  

మరింత సమాచారం తెలుసుకోండి: