రెడ్ మీ కి పోటీగా వచ్చి సక్సెస్ ఫుల్ గా జనాలలో దూసుకుపోతున్న రియల్ మి ఎక్స్ 50 ఫోన్ అదిరిపోయే ఫిచర్లతో ముందుకు సాగిపోతుంది. అయితే ఇలా ముందుకు దూసుకుపోయే ఈ రియల్ మి బ్రాండ్ నుండి జనవరి 7న రియల్‌మి 5జీ స్మార్ట్‌ఫోన్ 'రియల్‌మి ఎక్స్50' స్మార్ట్ ఫోన్ విడుదల కానుంది. 

 

ఈ రియల్‌మి ఎక్స్50 ఫోన్‌లో భారీ సామర్థ్యం కలిగిన బ్యాటరీని ఉపయోగించినట్టు తెలుస్తోంది. ఈ బ్యాటరీతో రెండు రోజులపాటు ఫోన్‌కు చార్జింగ్‌తో పనిలేదని సమాచారం. చైనా మైక్రో బ్లాంగింగ్ ప్లాట్‌ఫాం వీబోలో ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్ చక్కర్లు కొడుతోంది. ఒక రోజంతా ఉపయోగించిన తర్వాత కూడా ఇంకా 62 శాతం చార్జింగ్ మిగిలి ఉన్నట్టు ఈ స్క్రీన్ షాట్ చూపిస్తోంది. 

 

కాగా, ఈ ఫోన్‌కు సంబంధించిన ముఖ్యమైన స్పెషిసిఫికేషన్లను కంపెనీ ఇప్పటికే బయటపెట్టింది. కొత్తగా లాంచ్ అయిన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 765జి చిప్‌సెట్‌ను ఇందులో ఉపయోగించారు. ఈ ఫోన్ ఒకేసారి 5జీ, వై-ఫై కనెక్షన్లకు సపోర్ట్ చేస్తుంది. 6.44 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 60 ఎంపీ+8ఎంపీ+2ఎంపీ+2ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా, 32 ఎంపీ+8ఎంపీ డ్యూయల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. దీంతో ప్రస్తుతం ఈ ఫోన్ కోసం నెటిజన్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: