కోట్లాది జనం తమను తాము యూట్యూబ్‌ లో చూసుకుంటున్నారు. ఏ ముహూర్తంలో దీనిని క్రియేట్ చేశారో కానీ అప్పటి నుండి నేటి దాకా మిస్సైల్ కంటే వేగంగా తన రికార్డ్ ను తానే అధిగమిస్తోంది. యూట్యూబ్‌లో సెకన్ల వ్యవధిలోనే.. దేశ వ్యాప్తంగా కొన్ని వేల వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వినోదం.. విజ్ఞానం.. వికాసం.. ఆటలు.. ప్రకృతి.. ఆధ్యాత్మికం.. ప్రపంచం.. అడవులు.. జంతువుల విన్యాసాలు ఇలా ప్రతిదీ ఇందులోకి చేరిపోతోంది. ఇక స్మార్ట్ ఫోన్ల‌ రాకతో దేశంలో మొబైల్ డేటా వినియోగం భారీగా పెరుగుతోంది. మొబైల్ లో ముచ్చటించ‌డం కంటే నచ్చిన వీడియోలను తిలకించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.  ప్రతి మొబైల్‌ వినియోగదారుడు రోజుకు సగటున 67 నిమిషాలు వీడియోలు చూడటానికి సమయం కేటాయిస్తున్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. 

 

నిజానికి 2012లో కేవలం రెండు నిమిషాలు మాత్రమే వీడియోలకు కేటాయించగా ఇప్పుడు రోజుకు ఏకంగా గంటకు పైగా వీడియోల లోకంలో విహరిస్తున్నట్లు `యాప్ అన్నే` సంస్థ తెలిపింది. మ‌రి వీడియోలు తిలకించేందుకు అత్యధికంగా యూట్యూబ్‌ను అనుసరిస్తూ ఉండగా ఆ తర్వాత స్థానంలో హాట్‌స్టార్‌, జియో టీవీ, ప్రైమ్ వీడియో యాప్స్ ఉన్నాయి. అయితే హిందీయేత‌ర‌ వీడియోల విషయానికి వస్తే తెలుగు వీడియోల‌కు అత్యధిక డిమాండ్ ఉన్నట్టు `విడోలి` సంస్థ తన నివేదికలో పేర్కొంది. తెలుగు వీడియో లకు అత్యధిక వీక్షాధారణ ఉంది. ఇక‌ యూట్యూబ్ లో అప్‌లోడ్ అయ్యే వీడియోలో తెలుగువే అత్యధికంగా ఉన్నాయి.

 

ప్రాంతీయ భాషల్లో 2018లో తెలుగు వీడియోలు 6,740 కోట్ల సార్లు వీక్షించడంతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో తమిళ, పంజాబీ, మలయాలీ, భోజ్‌పురి వీడియోలు ఉన్నాయి. తెలుగులో న్యూస్ ఛానళ్లు, సినీరంగ విషయాలకు ఆదరణ లభిస్తోంది. అలాగే 2016 లో తెలుగు వీడియోల‌ వీక్షణల సంఖ్య 1,270 కోట్లు కాగా, రెండేళ్లలో ఇది 6,740 కోట్లకు చేరింది. ఇక యూట్యూబ్లో అత్యధికంగా అప్లోడ్ అవుతున్న వీడియోల్లో తెలుగే మొదటి స్థానంలో ఉన్నట్టు `విడోలి` తెలిపింది. 2016 లో మొత్తం 1.6 కోట్ల తెలుగు వీడియోలు అప్‌లోడ్ కాగా, 2018 నాటికి ఇది 16.6 కోట్లు దాటేయ‌డం విశేషం.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: