ప్రస్తుత రోజుల్లో సమాజంలో స్మార్ట్ ఫోన్ ప్రతి వ్యక్తి జీవితంలో ఒక భాగమైపోయింది. చాలామంది వ్యక్తిగత విషయాలు అలాగే కుటుంబ విషయాలు గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఒకరి అభిప్రాయాలను మరొకరు పంచుకుంటున్నారు. ముఖ్యంగా వాట్సాప్ ద్వారా అదేవిధంగా వాట్సాప్ గ్రూపుల ద్వారా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ అనేక విషయాల గురించి చర్చించుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో తాజాగా వాట్సాప్ ప్రతి ఒక్కరూ వాడుతున్న తరుణంలో సైబర్ నేరగాళ్లు కొత్త మోసం కోసం తెగపడటానికి రెడీ అయ్యారు. సైబర్ నేరగాళ్లు వాట్సప్ వేదికగా చేసుకొని కొత్త తరహా మోసాలు తెగబడి ఆన్​లైన్​లో తమ వస్తువులు అమ్మకానికి పెట్టేవారిని నేరగాళ్లు లక్ష్యం చేసుకుంటు వస్తువులు కొంటామనే నెపంతో క్యూఆర్ కోడ్​లను పంపించి బాధితుల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు మాయం చేస్తున్నారు.

 

ఆన్​లైన్​లో ఎవరైతే తమ వస్తువులను అమ్మాలని భావిస్తారో వారిని టార్గెట్ గా చేసుకుని సైబర్ నేరగాళ్లు వాళ్ల వివరాలు మరియు బ్యాంకు ఖాతాల డీటెయిల్స్ క్యూఆర్​ కోడ్ అన్ని విషయాలు తెలుసుకొని వస్తువులు కొంటామని చెప్పి డబ్బులు దండుకుంటున్నారు. ముందుగా డబ్బులు పంపిస్తామని ఈ విధంగా మోసం చేస్తారు..ఎలా అంటే నమ్మకంగా చెబుతారు. మీ బ్యాంకు ఖాతా వివరాలు, మీ వాట్సాప్ నెంబర్​ అడుగుతారు. మీరిచ్చిన వివరాలు తీసుకున్న తరువాత.. మీ వాట్సాప్ ఖాతాకు ఓ క్యూఆర్​ కోడ్ పంపిస్తారు. దీనిని స్కాన్​ చేస్తే నగదు మీ ఖాతాలో పడుతుందని చెబుతారు. నిజానికి వారు పంపే క్యూఆర్​ కోడ్​ మీ నుంచి నగదు అభ్యర్థిస్తూ పంపించే కోడ్​.

 

పొరపాటున దానిని స్కాన్ చేసారో.. మీ ఖాతా నుంచి డబ్బులు కట్ అయ్యి వారి ఖాతాలో పడపోతుంది. అంతే మీ డబ్బు ఢమాల్​ అవుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఇలాంటివి వాట్సాప్ వాడుతున్న ప్రతి ఒక్కరి తెలుసుకుని ఇతరులకు చెప్పే విధంగా ఆన్​లైన్​లో తమ వస్తువులు అమ్ముతున్న వాళ్ళు ఈ విషయాలు తెలుసుకుంటే తమ డబ్బులు జాగ్రత్త చేసుకున్నట్లే లేక పోతే మీ డబ్బులు గోవిందా. కనుక మొత్తం మీద అవగాహన లేని లింకులు జోలికి అదేవిధంగా క్యూఆర్ కోడ్​ల జోలికి వెళ్లకుండా ఉండటం ఉత్తమం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: