ఇప్పటికే ఎన్నో మోడల్స్ స్మార్ట్ ఫోన్ అందించిన చైనా దిగ్గజ కంపెనీ ఒప్పో తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ 'ఒప్పో ఎఫ్15'ను ఈ నెల 16న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. 'ఒప్పో ఎఫ్11 ప్రొ', 'ఒప్పో ఎఫ్9ప్రొ'కు ఇది అప్‌గ్రేడెడ్ వెర్షన్ అని ఒప్పో పేర్కొంది. ఇందులో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉన్నట్టు తాజాగా బయటకు వచ్చాయి. 

 

అయితే ఈ ఫోన్ అన్ని ఫోన్ల కాదు ఎన్నో ప్రత్యేకతలు ఈ ఫోన్ లో ఉన్నాయి. పవర్ ఫుల్ బ్యాటరీతో ఈ స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఐయుదు నిముషాలు పెడితే రెండు గంటల పాటు ఛార్జింగ్ వచ్చే స్మార్ట్ ఫోన్ ఇది.  అంతేకాదు ఈ స్మార్ట్ ఫోన్ లో కెమెరా కూడా అద్భుతంగా ఉంది. 48 ఎంపీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ క్వాడ్ రియర్ కెమెరా ఈ ఫోన్ లో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ కూడా సంబంధించి మరిన్ని ప్రత్యేకతలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకొండి. 

 

ఒప్పో ఎఫ్15 ప్రత్యేకతలు...  

 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ 48 ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా, 

 

శక్తిమంతమైన బ్యాటరీ, 

 

ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 

 

వూక్ ఫ్లాష్ చార్జ్ 3.0, 

 

8జీబీ ర్యామ్, 

 

128 జీబీ స్టోరేజీ, 

 

6.4 అంగుళాల డిస్‌ప్లే, 

 

ఆండ్రాయిడ్ 9, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: