మరో సంచలనానికి జియో సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టెలికాం రంగంలో ఎన్నో సంచలనాలు సృష్టించిన జియో మూడు సంవత్సరాల క్రితం జియో ఫోన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఆ తరువాత జియో ఫోన్ కు మరిన్ని ఫీచర్లను జోడిస్తూ జియో ఫోన్ 2 మార్కెట్లోకి వచ్చింది. ఫీచర్ ఫోన్లలో అమ్మకాల పరంగా జియో ఫోన్ అగ్ర స్థానంలో ఉంది. జియో ఫోన్ అగ్ర స్థానంలో ఉండటానికి ఫీచర్లు, ధర ప్రధాన కారణాలు. 
 
ప్రస్తుతం జియో జియో ఫోన్ కంటే చౌకైన ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొనిరావటానికి ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. జియో ఫోన్ లైట్ పేరుతో కేవలం 399 రూపాయలకే మార్కెట్లోకి కొత్త ఫోన్ ను అందుబాటులోకి తీసుకొనిరావటానికి జియో ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ కు కేవలం 50 రూపాయల రీఛార్జ్ ప్లాన్ తో కాల్స్ చేసుకునే విధంగా కొత్త ప్లాన్ ను జియో రూపొందించబోతుందని తెలుస్తోంది. 
 
ఈ ప్లాన్ ద్వారా జియో నుండి జియోకు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చని ఇతర నెట్వర్క్ లకు కాల్ చేస్తే మాత్రం ఐయూసీ ఛార్జీలు విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. అధికారికంగా జియో నుండి ఈ ఫోన్ గురించి ప్రకటన రాలేదు. అందువలన ఈ ఫోన్ లాంఛ్ మత్రం మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. జియో కంపెనీ వార్షిక సమావేశంలో ఈ ఫోన్ లాంఛ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ఈ ఫోన్ కు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండదని సమాచారం. 91 మొబైల్స్ జియో సంస్థ జియో లైట్ ఫోన్ ను లాంఛ్ చేయబోతున్నట్టు ప్రకటన చేయగా జియో ఈ వార్తను అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: