వాట్సప్ పరిచయం అక్కర్లేని ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్. దాదాపు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ఈ యాప్‌ను ఉప‌యోగిస్తున్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ వినియోగదారులకు అందించడంలో వాట్సాప్‌ ముందంజలో ఉంటుంది. మారుతున్న ట్రెండ్ కు తగ్గట్టుగా.. మెసేజ్ ల నుంచి ఫోటో షేరింగ్, వీడియో షేరింగ్ వంటి కొత్త కొత్త మార్పులను తీసుకొచ్చింది. ఎన్నో ఫీచర్స్‌తో రోజురోజుకీ అప్‌డేట్ అవుతూ యూజర్స్ మనసు గెలుచుకుంటోంది. ఇక ఈ యాప్‌ను  ప్రతి ఒక్కరూ రోజు వారీ అవసరాలకు, ఆఫీస్ ల్లో కమ్యూనికేషన్ కోసం ఇలా వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు.

 

అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్‌కు 300 మిలియన్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియా వచ్చిన తర్వాత సందేశాలు పంపుకోవడం మరింత సులభతరం అయింది. ప్రత్యేకించి ఏదైనా పండుగలు, విశిష్టమైన పర్వదినాల్లో సామాజిక మాధ్యమాలు శుభాకాంక్షలతో పొంగిపొర్లుతుంటాయి. తాజాగా, న్యూ ఇయర్ సందర్భంగా ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో సందేశాల సునామీ వచ్చిందంటే అతిశయోక్తి కాదు. 

 

నూతన సంవత్సరాది ముందు రోజున వాట్సాప్ లో 100 బిలియన్ల సందేశాలు పోస్టు అయినట్టు గుర్తించారు. వాటిలో 12 బిలియన్లు ఫొటోలే ఉన్నాయి. వాట్సాప్ రంగప్రవేశం చేసిన తర్వాత ఇన్నేళ్లలో ఒక్కరోజే ఇన్ని సందేశాలు రావడం ఇదే మొద‌టి సారి అని యాజమాన్యం పేర్కొంది. కాగా, ఆ వంద బిలియన్ల సందేశాల్లో ఒక్క భారత్ నుంచే 20 బిలియన్ సందేశాలు పోస్ట్ అయిన‌ట్టు కూడా వారు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: