సాధార‌ణంగా వేలకు వేలు పోసి మరీ స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేస్తుంటాం. కానీ.. ఉదయం ఫోన్ కి ఫుల్ ఛార్జింగ్ పెడితే.. మధ్యాహ్నానికి బ్యాటరీ ఖాళీ అయిపోతుంది. ఈ స‌మ‌స్యను చాలా మంది ఎదుర్కొంటున్నాయి. ఒక్కోసారి అత్యవసర సమయాల్లో చార్జింగ్ అయిపోతే మన బాధ వర్ణనాతీతం. అంతేకాకుండా బ్యాటరీ విషయంలో మనం తగు జాగ్రత్తలు తీసుకోకపోతే.. అది ఫోన్ పనితీరు, జీవితకాలం మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అందుకే స్మార్ట్ ఫోన్ కి బ్యాటరీ లైఫ్ చాలా ముఖ్యం. అయితే బ్యాట‌రీ విష‌యంలో కొన్ని టిప్స్ ఫాలో అయితే ఈజీగా ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవ‌చ్చు.

 

అందుకు మీ స్మార్ట్ ఫోన్ లో కొన్ని సెట్టింగ్స్ మార్చడం ద్వారా బ్యాటరీ లైఫ్ ను మెరుగు పరచవచ్చు. ఆటో బ్రైట్ నెస్ ఆప్షన్ ను డిసేబుల్ చేసి బ్రైట్ నెస్ ను 50 శాతం లోపే ఉంచాలి. మీ ఫోన్ స్క్రీన్ ఎంత ప్రకాశవంతంగా వెలిగితే.. మీ ఫోన్ లో అంత చార్జింగ్ అయిపోతుందన్న మాట. ఫోన్ లో చాలా యాప్స్ ఉంటాయి. వాటిని అవసరాన్ని బట్టి ఉపయోగిస్తూ ఉంటాం. ఓపెన్ చేసిన యాప్స్ ని అవసరం తీరాక క్లోజ్ చేయాలి. అంటే వెంటనే హోమ్ బటన్ నొక్కడం కాదు. 

 

ఒక్కోసారి హోమ్ పేజీకి వెళ్లినా ఆ యాప్స్ రన్ అవుతూనే ఉంటాయి. దాని వల్ల  ఫోన్ బ్యాటరీ అయిపోతుంది. కాబట్టి వాటిని క్లోజ్ చేయాలి. అవసరం ఉన్నా లేకున్నా.. చాలా మంది వారి వైఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి వాటిని 24గంటలు ఆన్ లోనే ఉంచుతారు. ఇవి ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోవడానికి కారణమవుతాయి. ప్రతి స్మార్ట్ ఫోన్ లో బ్యాటరీ సేవింగ్ ఫీచర్స్ ఉంటాయి. ఒక్కో ఫోన్ లో ఒక్కో పేరుతో ఉంటాయి. అయితే అవి స‌రిగ్గా చూసి అవి వినియోగించుకొని బ్యాటరీ సేవ్ చేసుకోవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: