కొత్తగా వచ్చిన స్మార్ట్ ఫోన్ కంపెనీలు తమ ఫోన్స్ సేల్స్ విషయం లో ఎంతగా ఆధిక్యం లో ఉన్నాయో మనకి తెలిసిన విషయమే. కెమెరా, డిస్ప్లే, ఇంటర్నల్ ష్టోరేజ్, ram ఇలా ఎన్నో రకాల మార్పులు చేస్తూ ఒకదాన్ని మించి ఒకటి మనకి మార్కెట్ లో దొరుకుతున్నాయి. అయితే కొన్ని ఫోన్స్ లో మాత్రం వాడుతున్నప్పుడు యాడ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇది ఆ కంపెనీ వారికి డబ్బు సంపాదించే ఒక వ్యాపార అవకాశం కావచ్చు, కాని ఫోన్స్ వాడుతున్నవారు మాత్రం ఇబ్బంది పడుతున్నారు... అయితే రియల్ మీ

 

వారిది అలంటి కంపెనీ కాదని. మేము ఫోన్ మాత్రమే అమ్ముతాము యాడ్స్ ని కాదని మొదటిలోనే ప్రకటించింది. ప్రస్తుతం మార్కెట్ లో అగ్ర స్థానం లో ఉన్న స్మార్ట్ ఫోన్స్ కంపెనీస్ లో ఒకటైన షావొమి కి సవాల్ గా ఎన్నో రకాల కొత్త మోడల్స్ ని కూడా విడుదల చేసింది. షావొమి రెండు మూడేళ్ళుగా స్మార్ట్ ఫోన్స్ లో యాడ్స్ పోస్ట్ చేస్తూ డబ్బు సంపాదిస్తోంది. అయితే రియల్ మీ ది అలంటి తరహ వ్యాపారసూత్రం కాదని మొదటిలో ప్రకటించినా...  ఇప్పుడు రియల్‌మీ తన స్టైల్ ని కూడా మార్చేస్తోంది.

 

 

ఇకపై రియల్‌మీ  బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ లో కూడా యాడ్స్ కనిపించాబోతున్నాయి. అతి త్వరలోనే ఇందుకు సంబంధించిన అప్డేట్స్ వస్తాయి. కలర్ ఓఎస్ ను అప్డేట్ చేసిన తరువత ఈ బ్రాండ్ ఫోన్ లో యాడ్స్ కనిపిస్తాయి. కాకపోతే ఈ బ్రాండ్ చిన్న మార్పు చేసింది, ప్రకటనలను యాడ్స్ పేరుతో ఇవ్వకుండా కంటెంట్ రికమండేషన్ పేరుతో పోస్ట్ చేయనుంది. ఇక రియల్‌మీ ఫోన్స్ లో కూడా యాడ్స్ తప్పవు మరి.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: