వాట్సాప్ ఇప్పుడు ఇది లేకపోతే ఒక్కరోజు కూడా గడవదు. ఒకప్పుడు మెసెజ్ పెట్టాలంటే రూపాయి కట్టవుతుంది అది ఇది అని ఆలోచించే ప్రజలు ఇప్పుడు క్షణాల్లో వంద మెసెజ్ లను పెట్టేస్తుతున్నారు. ఇది ఎవరి వల్ల జరిగింది. వాట్సాప్ అనే ఒక యాప్ వల్ల. ఏదైనా సమాచారం తెలుసుకోవాలన్న, తెలపాలన్న మనం ఉపయోగించేది వాట్సాప్. ఇప్పుడు ప్రతిది వాట్సాప్ వల్లే జరుగుతుంది.    

 

అయితే తాజాగా వాట్సాప్ లో ఒక కొత్త సమస్య వచ్చి పడింది. కొత్త సమస్య అంటారు ఏంటి ఇప్పటివరకు మనకు వాట్సాప్ లో ఏ సమస్యలు లేవు అని అనుకుంటున్నారా ఏంటి? ఉన్నాయి కానీ అవి పెద్దగా సమస్యలు అనిపించలేదు. అయితే ఇప్పుడు కొత్త సమస్య ఏంటంటే.. మన కర్మ కాళీ.. వాట్సాప్ లో కూడా యాడ్ లు వస్తాయి అంటా.. 

 

ఇప్పటికే అన్నిచోట్లా యాడ్ లు చూసి చూసి పిచ్చి పట్టి.. ఫోన్ హ్యాంగ్ అయ్యి చస్తుంటే.. వాట్సాప్ లో కూడా యాడ్ లు వస్తాయి అంట.. మనం ఎంత వాట్సాప్ వాడితే మాత్రం వాట్సాప్ వాళ్ళు యాడ్ లు పెట్టారు అంటే.. టెలిగ్రామ్.. హైక్ వంటి వాటికీ వెళ్లిపోవాల్సి వస్తుంది. ఇంకా అన్ని కలిసి నిర్ణయం తీసుకుంటే మాత్రం కుక్కిన పేనులా మూసుకొని వాడాల్సిందే.. 

 

కానీ ఇలా వాట్సాప్ లో యాడ్ లు వచ్చాయి అంటే.. ప్రజలు ఏమి ఊరికే ఉండరు.. వెంటనే ఆన్ ఇంస్టాల్ చేసి పడేస్తారు. ఏది ఏమైనా మనకు త్వరలోనే వాట్సాప్ యాడ్ బాధ రానుంది.. ఫేసుబుక్ లో ఇప్పటికే ఈ బాధ పడుతున్నాం.. వాట్సాప్ లో పడలేమా ఏంటి? ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మాదిరిగానే వాట్సాప్‌లో కూడా యాడ్స్ వస్తాయి.. అక్కడ బాధలు ఇక్కడ కూడా పడుదాం. ఇన్నాళ్లు పడము కదా ఇక నుండి పడుదాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: