ఇటీవ‌ల రిలయెన్స్ జియో యూజర్లకు మరో శుభవార్త చెప్పిన సంగ‌తి తెలిసిందే. అదేనండీ.. వైఫై ద్వారా వాయిస్, వీడియో కాల్స్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది రిలయెన్స్ జియో. ఇందుకోసం అదనంగా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం 150 స్మార్ట్‌ఫోన్ల ద్వారా వైఫై వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. కేవలం డేటా మాత్రమే ఖర్చవుతుంది. అలాగే భారతదేశంలో ఏ వైఫై నెట్వర్క్‌లో అయినా ఈ సర్వీస్ పనిచేస్తుంది. మ‌రి అసలు ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది? 'జియో వైఫై కాలింగ్' కోసం మీ స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్స్ ఎలా మార్చాలో తెలుసుకోండి.

 

జనవరి 8న దేశవ్యాప్తంగా ఈ సర్వీస్‌ని ప్రారంభించింది. కస్టమర్లు ఏ వైఫై నెట్వర్క్ అయినా ఉపయోగించుకొని జియో వైఫై కాలింగ్ చేసుకోవచ్చు. VoLTE లేదా వైఫై ద్వారా వాయిస్, వీడియో కాల్స్‌కి సులువుగా మారొచ్చు. కస్టమర్ల సంఖ్య పెరుగుతున్నందున వాయిస్ కాలింగ్ అనుభవాన్ని పెంపొందించేందుకు జియో వైఫై కాలింగ్ సర్వీస్‌ని ప్రారంభించిన‌ట్టు తెలుస్తోంది. ఇక‌ జియో వైఫై కాలింగ్ దాదాపు అన్ని ప్రధాన స్మార్ట్‌ఫోన్లల్లో పనిచేస్తుంది.  మీ స్మార్ట్‌ఫోన్‌లో వైఫై కాలింగ్ సదుపాయం ఉంటే ఈ సర్వీస్ ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.  

 

జియో వైఫై కాలింగ్ ఫీచర్ ఉపయోగించాలంటే మీ స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్స్ మార్చాల్సి ఉంటుంది. మీరు ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగిస్తున్నట్టైతే ముందుగా Settings ఓపెన్ చేయండి. ఆ తర్వాత Connections ఓపెన్ చేయండి. అందులో వైఫై కాలింగ్ ఆన్ చేయండి. ఇక‌ మీరు యాపిల్ ఫోన్ ఉపయోగిస్తున్నట్టైతే ముందుగా Settings ఓపెన్ చేయండి. ఆ తర్వాత phone ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అందులో Wi-fi Calling ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత వైఫై కాలింగ్ సర్వీస్‌ని ఆన్ చేయండి. సో.. ఈ అదిరిపోయే ఫీచ‌ర్‌ను మీరు వినియోగించుకోండి మ‌రి. 

మరింత సమాచారం తెలుసుకోండి: