స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్ర‌తిఒక్క‌రికి వాట్సాప్ అవ‌స‌రం లేని పేరు. స్మార్ట్‌ఫోన్‌ కొనే చాలామంది మొదట ఇన్‌స్టాల్‌ చేసే యాప్‌ వాట్సప్‌ అంటే అతిశయోక్తి కాదు. మెసేజులు పంపడానికి, వాయిస్, వీడియో కాల్స్ చేయడానికి, ఫోటోలు, డాక్యుమెంట్లు షేర్ చేసుకోవడానికి ఈ యాప్ ను విపరీతంగా వాడుతున్నారు. వాట్సాప్ కూడా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను తీసుకువ‌స్తూ యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. సమాచారం సులువుగా ఇచ్చిపుచ్చుకునేందుకు ఓ మార్గంగా మొదలైన ఈ టెక్‌ వేదిక.. ఇప్పుడు అనేక విధాలుగా వినియోగిస్తున్నారు. 

 

అయితే వాట్సాప్ వెబ్ లో ఎక్కువ మందికి తెలియని కొన్ని అద్భుతమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేసేయండి.  పిక్చర్ ఇన్ పిక్చర్ ఫీచర్ వాట్సాప్ వినియోగదారులకు 2018 నుంచి అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వీడియోలను వాట్సాప్ యాప్ లో నుంచి బయటకు వెళ్లకుండానే చూడవచ్చు. మీరు వాట్సాప్ వెబ్ ను గూగుల్ క్రోమ్ లో ఉపయోగిస్తున్నట్లయితే.. ఒకేసారి రెండు ఖాతాలతో లాగిన్ అవ్వచ్చు. ఎలా అంటే.. మొదటి ఖాతాతో నార్మల్ మోడ్ లో లాగిన్ అవ్వండి. 

 

రెండో ఖాతాతో ఇన్‌కోగ్నిటో మోడ్ లో లాగిన్ అయితే స‌రిపోతుంది. అదేవిధంగా, బ్యాక్ గ్రౌండ్ నోటిఫికేషన్.. మీరు ఏదైనా మెసేజ్ ను చదవడానికి యాప్ ద్వారా వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఎక్స్ టెన్షన్ ఐకాన్ ద్వారా మీరు మెసేజ్ లను చదవచ్చు. అంతేకాకుండా మీరు చదవని మెసేజ్ లు ఎన్ని ఉన్నాయో కూడా చెక్ చేయవచ్చు. మ‌రియు మీ వాట్సాప్ స్టేట‌స్ నుంచీ ఫేస్‌బుక్‌కు కూడా షేర్ చేయొచ్చు. దీనికి  మీ ఫోన్‌లో స్టేటస్ క్రియేట్ చేసి.. ఆ తర్వాత స్టేటస్ ఓపెన్ చేయండి. మీకు షేర్ టు ఫేస్‌బుక్ స్టోరీ ఆప్షన్  క్లిక్ చేస్తే స‌రిపోతుంది. ఆ తర్వాత మీరు ఎవరికి షేర్ చేయాలనుకుంటున్నారో కూడా సెలెక్ట్ చేయొచ్చు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: