నిన్నమొన్నటివరకూ పెద్దగా ఇమేజ్‌ లేని రియల్‌మీ బ్రాండ్‌ మొబైల్‌ ఫోన్లు నెమ్మదిగా క్రేజ్‌ సంపాదించుకుంటున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో రియ‌ల్‌మీ ఫోన్లకు బాగా డిమాండ్ పెరిగిపోయింది. చాలా మంది ఈ ఫోన్ల‌ను కొన‌డానికి ఇష్ట‌ప‌డుతున్నాయి. అయితే రియ‌ల్‌మీ వాడుతున్న వారంద‌రికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పాలి. రియల్‌మీ యూజర్ ఇంటర్‌ఫేస్-UI వచ్చేస్తోంది. కొద్దిరోజుల క్రితమే ఆండ్రాయిడ్ 10 బేస్డ్ రియల్‌మీ యూఐ ప్రకటించింది కంపెనీ. ఇప్పటివరకు రియల్‌మీ ఫోన్లన్నీ కలర్ ఓఎస్‌తో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. 

 

అయితే కలర్ ఓఎస్ నచ్చనివాళ్లు రియల్‌మీ ఫోన్లు కొనేందుకు ఆసక్తి చూపట్లేదని కంపెనీ గుర్తించింది. అందుకే సొంతగా యూఐ రూపొందించింది రియల్‌మీ. ఐకాన్స్ కస్టమైజేషన్, ప్రకృతిని తలపించే వాల్ పేపర్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్ ఫీచర్ లాంటి ప్రత్యేకతలు రియల్‌మీ యూఐలో ఉంటాయి. మామూలుగా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి మూడు వేళ్లతో స్క్రీన్‌పైన స్వైప్ చేయడం అలవాటు. కానీ.. రియల్‌మీ యూఐలో జస్ట్ మూడు వేళ్లతో హోల్డ్ చేస్తే చాలు స్క్రీన్‌షాట్ వచ్చేస్తుంది. ఇక స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియెన్స్ అందించేలా రియల్‌మీ యూఐ రూపొందించినట్టు కంపెనీ చెబుతోంది. 

 

ఇక మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయిన కాల్ హిస్టరీ, కాంటాక్ట్స్, మెసేజెస్‌కు ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది. ఇప్పటికే కొన్ని ఫోన్లకు రియల్‌మీ యూఐ రిలీజ్ అయింది. మరి ఎప్పుడెప్పుడు ఏఏ ఫోన్లకు రియల్‌మీ యూఐ అప్‌డేట్ వస్తుందో తెలుసుకోండి. 2020 ఫిబ్రవరి- రియల్‌మీ ఎక్స్, రియల్‌మీ 5 ప్రో, 2020 జనవరి- రియల్‌మీ 3 ప్రో, రియల్‌మీ ఎక్స్‌టీ, 2020 మార్చి- రియల్‌మీ ఎక్స్‌2, రియల్‌మీ ఎక్స్2 ప్రో, 2020 ఏప్రిల్‌- రియల్‌మీ 3, రియల్‌మీ 3ఐ, 2020 మే- రియల్‌మీ 5, 2020 జూలై నుంచి సెప్టెంబర్ మధ్య- రియల్‌మీ సీ2, రియల్‌మీ 5ఎస్2020 జూన్- రియల్‌మీ 2 ప్రోల‌కు యూఐ అప్‌డేట్ రానుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: