టిక్ టాక్.. ఈ పేరు తెలియ‌ని వారుండ‌రు. చైనాకు చెందిన ఈ షార్ట్‌ వీడియో మెస్సెజ్‌ యాప్‌కు.. మన యూత్‌ దాసోహం అంటోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా.. ఈ యాప్‌లో వీడియోలు పెట్టడం.. తమ టాలెంట్‌ను చూపించుకోవడం సరదాగా మారిపోయింది. ఇప్పుడు ఎవరైనా గంటలు గంటలు ఒంటరిగా గడిపేస్తున్నారంటే.. టిక్ టాక్­లో దూరిపొయ్యారని అర్థం చేసుకోవాలి. స్మార్ట్ ఫోన్‌ అదేపనిగా స్క్రోల్ చేసేస్తున్నారంటే కూడా టిక్ టాక్ వీడియోస్ చూస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఇలా వీడియోలు చూస్తూ, చేస్తూ కుటుంబాలను కూల్చుకుంటున్న వారూ, ప్రాణాలు తీసుకుంటున్నవారూ ఎందరో. 

 

అందులో వచ్చే 15 సెకండ్ల షార్ట్ వీడియో మెసేజ్‌లను చూస్తూ ఎంజాయ్ చేసేవారు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా యువతీ, యువకుల్లో దీనికున్న ఆదరణ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గతేడాది ప్రపంచ వ్యాప్తంగా 700 మిలియన్లకు పైగా టిక్‌టాక్‌ యాప్‌ డౌన్‌లోడ్‌లు జరిగాయి. ఈ విషయాన్ని ప్రముఖ మార్కెటింట్‌ సంస్థ సెన్సార్‌ టవర్‌ వెల్లడించింది. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ను వెనక్కినెట్టివే సిందని పేర్కొంది. ఇక 2018లో డౌల్‌లోడ్స్‌ పరంగా నాలుగో స్థానంలో ఉన్న టిక్‌టాక్‌.. రెండు, మూడు స్థానాల్లో ఉన్న ఫేస్‌బుక్‌ మేసెంజర్‌, ఫేస్‌బుక్‌ యాప్‌లను అధిగమించి రెండో స్థానంలో నిలిచిందని తెలిపింది.

 

అయితే టిక్‌టాక్‌ యాప్‌ రెండో స్థానంలో నిలవడానికి ఇండియానే ప్రధాన కారణమని తెలిపింది. ఎందుకంటే ఆ యాప్‌ను తొలిసారి డౌన్‌లోడ్‌ చేసుకున్నవారిలో 45 శాతం భారత్‌ నుంచే ఉన్నట్టు పేర్కొంది. ఇప్పటివరకు రెండోస్థానంలో ఉన్న ఫేస్ బుక్ మెసెంజర్... టిక్ టాక్ ప్రభంజనంతో డీలాపడింది. కాగా, ఈ జాబితాలో ఫేస్ బుక్ కు చెందిన వాట్సాప్ అగ్రస్థానంలో ఉంది. వాట్సాప్ 850 మిలియన్ డౌన్ లోడ్లతో నెంబర్ వన్ గా కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: