వోడాఫోన్.. అదిరిపోయే ఆఫర్స్ ను ఇచ్చింది.. రెండు సరికొత్త ప్లాన్స్ ను తీసుకొచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..  ప్రముఖ టెలికం సంస్థ అయిన వొడాఫోన్ రెండు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు తేరా మిదకు తీసుకువచ్చింది. అపరిమిత వాయిస్ కాల్స్, హైస్పీడ్ డేటాతో కూడిన ఈ ప్లాన్ల ధరలు వరుసగా రూ.99, రూ.555. 

 

ఈ రెండు ప్లాన్లు ప్రస్తుతం ఎంపిక చేసిన సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. మొదట రూ.99 ప్రీపెయిడ్ ప్లాన్‌లో అపరిమిత లోకల్, ఎస్టీ కాల్స్ ప్రయోజనాలు, 1జీబీ హైస్పీడ్ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు 18 రోజుల కాలపరిమితితో లభిస్తుంది. ఇక రూ.555 వొడాఫోన్ ప్రీపెయిడ్ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 1.5 జీబీ హైస్పీడ్ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. 70 రోజుల కాలపరిమితి కూడా ఈ ప్లాన్ కు ఉంది.   

 

అయితే ఈ వొడాఫోన్ రూ.99 చోటా ప్లాన్ కోల్‌కతా, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా, రాజస్థాన్ సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక రూ.555 ప్లాన్ ఢిల్లీ, ముంబై సర్కిళ్లలో అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఐడియా యూజర్లు కూడా ఈ ప్లాన్లను ఉపయోగించుకోవచ్చు కానీ ప్రయోజనాల్లో మాత్రం ఎటువంటి తేడా ఉండదు... ప్లాన్స్ చూస్తే ఏం అనిపిస్తుంది ? అదిరిపోయాయి అనిపిస్తుందా ? 

మరింత సమాచారం తెలుసుకోండి: