ముకేశ్‌ అంబానీకి చెందిన 4జీ సేవల టెలికాం కంపెనీ రిలయన్స్‌ జియో మాంచి జోరు మీద ఉంది. రిలయన్స్ జియో రాకతో దేశీయ టెలికం రంగంలో మొబైల్ డేటా విప్లవానికి తెర లేసింది. తక్కువ ధరకే ఎక్కువ డేటా ఇవ్వడంతో ఇతర నెట్ వర్క్ యూజర్లంతా జియో బాటపట్టారు. చౌక ధరల్లో డేటా అఫర్లు అందిస్తూ అనతి కాలంలోనే కోట్లాది మంది వినియోగదారులను సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక తాజాగా మూడేళ్లలోనే (2016) జియో మరో రికార్డ్ సాధించింది. సబ్‌స్క్రైబర్ల పరంగా దేశంలోనే అతిపెద్ద టెలికం కంపెనీగా రిలయన్స్ జియో అవతరించింది.

 

టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ ట్రాయ్ గ‌ణాంకాల ప్రకారం.. గతేడాది నవంబర్‌ చివరినాటికి జియో చందాదారుల సంఖ్య 36.9 కోట్లకు చేరింది.  జియో తర్వాతి స్థానంలో 33.62 కోట్ల మంది వినియోగదారులతో వొడాఫోన్‌ ఐడియా, 32.73 కోట్ల వినియోగదారులతో ఎయిర్‌టెల్‌ నిలిచాయి. అక్టోబర్‌ నాటికి దేశంలో టెలికాం యూజర్ల సంఖ్య 120.48 కోట్లుండగా, నవంబర్‌ ముగిసేసరికి ఆ సంఖ్య 2.4 శాతం తగ్గి 117.58 కోట్లకు చేరుకున్నట్టు ట్రాయ్ తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది.

 

అయితే వొడాఫోన్‌ ఐడియా 36 మిలియన్ల మంది వినియోగదారులను కోల్పోయినప్పటకీ రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇక జియో కొత్తగా 56 లక్షలు, ఎయిర్‌టెల్ 16.59 లక్షలు, బీఎస్ఎన్ఎల్ 3.41 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను పెంచుకున్నాయి. అలాగే వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్స్ షేర్ మార్కెట్లో ప్రయివేటు ప్రొవైడర్స్‌ది దాదాపు 90 శాతం వాటా ఉంది. ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ మార్కెట్ వ్యాల్యూ 10 శాతానికి పైగా ఉంది. అక్టోబర్ చివరి నాటికి బీఎస్ఎన్ఎల్ మార్కెట్ వ్యాల్యూ 10.19 శాతంగా ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: