ఇటీవ‌ల కాలంలో  క్రెడిట్ కార్డులు ఏమోగానీ డెబిట్ కార్డులు మాత్రం అనేక మంది వ‌ద్ద ఉంటున్నాయి. ప్ర‌తి ఒక్క‌రికి బ్యాంక్ అకౌంట్ ఉండ‌డం వ‌ల్ల ఏటీఎంల వినియోగం పెరిగిపోతోంది. ఒక్కప్పుడు డబ్బులు కావాలంటే గంటల తరపడి క్యూలో బ్యాంకుల ముందు నిలపడాల్సి వచ్చేది . కానీ ఏటీఎంలు వచ్చాక ప్రతి ఒకరు అతి సులువుగా ఏటిఎం కేంద్రం వద్ద డ‌బ్బులు తీసుకుంటున్నారు. ఇక సాధార‌ణంగా ఏటీఎంను ఎక్కువ మంది నగదు తీసుకోవడానికి, తమ ఖాతాలో ఉన్న నిల్వను తెలుసుకోవడానికి వినియోగిస్తుంటారు. కాని, ఇవే కాకుండా అనేక విధాలుగా ఉప‌యోగించుకోవ‌చ్చు. మ‌రి అవేంటో ఓ లుక్కేసేయండి..!

 

చెక్‌ బుక్‌ అవసరమైనప్పుడు బ్యాంకు శాఖకు వెళ్లి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అయితే ఏటీఎం ద్వారా కూడా చెక్‌ బుక్‌ కోసం అప్లయ్‌ చేయవచ్చు. ఇందుకోసం ఏటీఎంలో ‘రిక్వెస్ట్‌ చెక్‌ బుక్‌’ అన్న ఆప్షన్‌ను ఎంచుకుంటే సరిపోతుంది. మొబైల్‌ ఫోన్‌ రీచార్జ్‌ కోసం కూడా ఏటీఎంను వినియోగించుకోవచ్చు. మొబైల్‌ ఫోన్‌ నెంబర్‌ ను ఎంటర్‌చేసి ఆపరేటర్‌ను ఎంచుకున్న తర్వాత ఎంత మొత్తమైతే రీచార్జ్‌ అవసరం ఉంటుందో ఆ వివరాలను తెలియజేస్తే రీచార్జ్‌ అయిపోతుంది. మీ సొంత నెంబర్‌నే కాకుండా.. ఇతరుల నెంబర్లకు కూడా రీచార్జ్‌ చేయవచ్చు. అలాగే బీమా కంపెనీల ప్రీమియంను కూడా ఏటీఎం ద్వారా చెల్లించవచ్చు. 

 

ఎల్‌ఐసీ, హెచ్‌డీఎ్‌ఫసీ లైఫ్‌, ఎస్‌బీఐ లైఫ్‌ తదితర సంస్థలు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చాయి. ప్రీమి యం చెల్లించడానికి గాను పాలసీ నెంబర్‌, పుట్టిన తేదీ లేదా మొబైల్‌ నెంబర్‌, ప్రీమియం అమౌంట్‌ వంటి వివరాల అవసరం ఉంటుంది. అదే విధంగా ఏటీఎం ద్వారా బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతాను కూడా తెరవచ్చు. ఏటీఎం స్ర్కీన్‌పై కనిపించే ఓపెన్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ అనే ఆప్షన్‌ను ఎంచుకుని ఎంత సొమ్ము ఎంత కాలానికి డిపాజిట్‌ చేయాలో తెలియజేస్తే ఆ మేరకు ఖాతాలోని సొమ్ము ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతాకు బదిలీ అవుతుంది. ఇలా అనేక ర‌కాలుగా ఏటీఎంను ఉప‌యోగించుకోవ‌చ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: