మనం ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయేవరకు స్మార్ట్ ఫోన్ లోనే ఉంటాం. ఎక్కువ భాగం అంటే మనం సెల్ వినియోగించుకునే సమయంలో దాదాపు 70 శాతం వాట్సాప్ ఏ ఉపయోగిస్తాం. కారణం ఏ పని ఉన్న సరే.. ఎవరితో మాట్లాడాలన్నా సరే మనకు వాట్సాప్ ఎంతో ఉపయోగ పడుతుంది. 

 

క్షణాల్లో పని అయిపోతుంది అందుకే వాట్సాప్ ఎక్కువగా వినియోగిస్తాం. చెప్పాలంటే వాట్సాప్ మన జీవితంలో నిత్యావసరం. బిజినెస్ డీల్స్, ఆఫీస్ వర్క్ అన్ని. ఎవరికైన ఏదైనా ఫోటో పంపాలంటే లేదా వీడియో పంపాలంటే వెంటనే మనం ఉపయోగిచ్చేది వాట్సాప్. అయితే ఇంకా ఈ వాట్సాప్ త్వరలోనే పని చేయదు.. 

 

అన్ని ఫోన్లలోనే కాదు లెండి.. కొన్ని ఫోన్లలో మాత్రమే ఈ వాట్సాప్ పని చేయదు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఫిబ్రవరి 1 నుంచి కొన్ని స్మార్ట్ ఫోన్లకు వాట్సాప్ పని చేయదని తేల్చి చెప్పింది. విండోస్ ఫోన్లకు ఈ సపోర్ట్ ఇప్పటికే పూర్తిగా నిలిచిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్ల కొత్త వాట్సాప్ అకౌంట్ ను క్రియేట్ చేయడం, దాన్ని వాట్సాప్ ధ్రువీకరించడం ఇకపై కుదరదు. 

 

ఈ విషయాన్ని వాట్సాప్ తన అధికారిక వెబ్ సైట్ ద్వారా తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి కొన్ని ఫోన్లలో వాట్సాప్ అస్సలు పని చేయదు.. ఆ ఫోన్లు ఇవే.. ఐవోఎస్ 8 లేదా అంత కంటే పాత వెర్షన్ల ఆపరేటింగ్ సిస్టం మీద పనిచేసే యాపిల్ ఐఫోన్లలో ఫిబ్రవరి 1 తర్వాత అస్సలు పని చేయదు.. 

 

ఆండ్రాయిడ్ ఎక్లెయిర్ 2.3.7 లేదా దాని కంటే పాత వెర్షన్ పై పనిచేసే అన్ని స్మార్ట్ ఫోన్లలోను వాట్సాప్ పని చేయదు.. అందుకే వాట్సాప్ కావాలి.. పని చేయాలి అంటే వెంటనే కొత్త ఫోన్లను కోనేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: