పాపం.. ఎయిర్టెల్ వినియోగదారులకు ఈ మధ్య గుండె పగిలే వార్తలు ఎక్కువైపోతున్నాయి.. రోజుకో షాక్ తగులుతూనే ఉంది.. ఈ నెట్వర్క్ వాడే వారికీ కోపం వచ్చి అబ్బా మారిపోదాం అనిపించేలా నెట్వర్క్ లో మార్పులు జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఎయిర్టెల్ మెల్లగా తన 3జీ సేవలను నిలిపివేయడం ప్రారంభించింది. 

 

ఆలా ప్రారంభిస్తూ.. ఈ ఏడాది మార్చి నెల సమయానికి అంత 3జీ సేవలను పూర్తిగా నిలిపివేస్తామని గత ఏడాదే తెలిపింది. ఈ నేపథ్యంలోనే గత సంవత్సరం చెప్పినట్టు క్రమంగా తన 3జీ సేవలను కోల్ కతాలో నిలిపి వేస్తూ వస్తుంది. 3జీ కోసం ఉపయోగించిన 900 హెర్ట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంను 4జీని బలోపేతం చేయడానికి వినియోగించనుంది. 

 

అయితే కోల్ కతాలో నిలిపి వేసినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సేవలు ఇంకా నిలిచిపోలేదు. కోల్ కతా, మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, కేరళ, కర్ణాటక, పంజాబ్, హరియాణా, గుజరాత్ ల్లో ఇప్పటికే ఎయిర్ టెల్ తన 3జీ సేవలను నిలిపివేసింది. అయితే ఈ విషయాలను స్వయంగా ఎయిర్టెల్ ఈ తమ వినియోగదారులకు తెలిపింది. 

 

అయితే 3జీ వినియోగదారులు వాయిస్ సర్వీస్ లను మాత్రం పొందగలరు. కాగా ఫీచర్ ఫోన్లు ఉపయోగించే వారి కోసం 2జీ సేవలను అలాగే కొనసాగిస్తామని ఎయిర్ టెల్ ఇప్పటికే ప్రకటించింది. 2,300 ఎంహెర్ట్జ్, 1,800 ఎంహెర్ట్జ్ బ్యాండ్స్ లో 4జీ సేవలను అందించడానికి ఎయిర్ టెల్ అత్యంత అధునాతమైన ఎల్900 టెక్నాలజీని 900 ఎంహెర్ట్జ్ బ్యాండ్ ద్వారా అందించనుంది. ఏది ఏమైతేనేం... ఎయిర్టెల్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్ చెప్పేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: