గగన్ యాన్ ప్రాజెక్టు దిశగా ఇస్రో మరో అడుగు ముందుకేసింది. వ్యోమగాముల్ని అనుకరించే వ్యోమమిత్ర హ్యుమనాయిడ్ రోబోను తయారు చేసింది. మానవ రహిత మిషన్లలో ఈ హ్యుమనాయిడ్ రోబోను ఉపయోగించి.. స్పేస్ లో వ్యోమగాములకు ఎలాంటి అవసరాలు ఉంటాయో.. ఇస్రో అంచనా వేస్తోంది. 

 

గగన్ యాన్ మిషన్ కోసం ఇస్రో వేగంగా సిద్ధమవుతోంది. ఇప్పటికే వ్యోమగాముల ఎంపిక పూర్తిచేసిన ఇస్రో.. వారిని రష్యాకు శిక్షణ కోసం పంపనుంది. ఆలోగానే స్పేస్ లో వ్యోమగాముల అవసరాలు తెలుసుకోవడానికి హాఫ్ హ్యుమానాయిడ్ రోబో వ్యోమమిత్రను తయారుచేసింది ఇస్రో. వ్యోమమిత్ర.. వ్యోమగాముల్ని అనుకరించగలదు. మాట్లాడగలదు. స్పేస్ క్రూ చేసే అన్నిపనులనూ వ్యోమమిత్ర చేయగలదు. మొదట మానవ రహిత మిషన్ లో వ్యోమమిత్రను ఉపయోగిస్తామని ఇస్రో చెబుతోంది. 

 

వ్యోమమిత్ర ప్రదర్శన అందర్నీ విశేషంగా ఆకట్టుకుంది. వ్యోమమిత్రను మొదట పంపించడం ద్వారా.. స్వేస్ లో వ్యోమగాముల అవసరాలపై ఇస్రో ఓ అంచనాకు రానుంది. స్పేస్ లో అత్యవసర పరిస్థితులు ఎదురైతే, వ్యోమగాముల ప్రాణం మీదకు వస్తే.. లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ ను ఎలా అందించాలో కూడా.. ఇస్రో వ్యోమమిత్ర ద్వారా ఓ అవగాహనకు రానుంది. గగన్ యాన్ మిషన్ లో వ్యోమమిత్ర కీలకమైన సమాచారం అందిస్తుందని ఇస్రో ఆశిస్తోంది. 

 

ఇస్రో తయారుచేసిన హాఫ్ హ్యూమనాయిడ్ రోబో వ్యోమమిత్ర స్పేస్ లో వ్యోమగాముల్ని ఏ మేరకు అనుకరిస్తుంది. ఏ మేరకుక సమాచారం పంపుతుంది. అదిచ్చే సమాచారం ఎంతవరకు ఉపయోగపడుతుందనేది త్వరలోనే తేలనుంది. మొత్తానికి ఇస్రో సాంకేతిక రంగంలో దూసుకెళ్తోంది. సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతూ దేశ కీర్తిని ప్రపంచానికి చాటుతోంది. ఎన్నో కీలకమైన ప్రయోగాలను చేపడుతూ ఆశ్చర్యపరుస్తోంది. సైన్స్ రంగంపై విద్యార్థుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎంతో మందిని దేశానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దేలా ఆదర్శవంతమైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు.. కీలకమైన ప్రమైయోగాలు చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: