స్మార్ట్ ఫోన్లు వచ్చిన తరువాత ప్రత ఒక్కరూ ఆన్‌లైన్లో గంటల కొద్దీ గడిపేస్తున్నారు. ఇక గూగుల్... ఇది పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. ఎందుకంటే దీని గురించి తెలియని వారంటు ఉండరు. అయితే మ‌నం వాడుతున్న ఆండ్రాయిడ్ ఫోన్‌లో మీరు గూగుల్‌కు చెందిన యాప్స్ చాలానే చూసి ఉంటారు. గూగుల్ మ్యాప్స్‌, క్రోమ్ బ్రౌజ‌ర్‌, డ్రైవ్‌, హ్యాంగ‌వుట్స్, మ్యాప్స్‌… ఇలా చెప్పుకుంటూ పోతే మ‌నం మ‌న ఫోన్ల‌లో గూగుల్ కు చెందిన యాప్స్‌ను చాలానే వాడుతున్నాం.  దీంతో స్మార్ట్‌ఫోన్ల‌లో ఉండే స‌మాచారాన్నంతా గూగుల్ ఎప్ప‌టిక‌ప్పుడు సేక‌రిస్తుంది. ఇక ఎవరికీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా.. ఇటీవ‌ల కాలంలో సెర్చ్ చేసేది ఒక్క గూగుల్ లో మాత్రమే.

ఈ నేప‌థ్యంలోనే గూగుల్‌లో ఎన్నో విష‌యాలు సెర్చ్ చేస్తుంటారు. కొన్ని విషయాలు వెతికినప్పుడు పర్లేదు కానీ కొన్ని విషయాలు వెతకడం అంత మంచిది కాదు. మ‌రి అవేంటో ఓ లుక్కేసేయండి. కొంతమంది సరదాగా తెలుసుకుందాం అనో లేదా బాగా డిప్రెషన్ లోకో వెళ్లిపోయి ఆత్మహత్య ఎలా చేసుకోవాలి అని వెతుకుతూ ఉంటారు. దీంతో పోలీసులు కొన్ని నిమిషాల్లోనే మీ ఐపీ అడ్రెస్ ను ట్రేస్ చేసి మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు నిజంగా డిప్రెషన్ లో ఉంటే కౌన్సెలింగ్ చేస్తారు. లేదా సరదాకి చేసి ఉంటే ఉతికారేస్తారు.

మాదకద్రవ్యాలు (డ్రగ్స్) కంపోసిషన్స్ తయారు చేయడం పై కూడా కొంతమంది ఆన్ లైన్ లో వెతుకుతూ ఉంటారు. ఇది కూడా పోలీసులకు పట్టించేదే. అలాగే గూగుల్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీ అస‌లు సెర్చ్ చేయ‌కూడ‌దు. ఇటీవ‌ల  రేప్ లు, కిడ్నాప్ లు, చిన్న పిల్లలపై లైంగిక వేధింపులకు చైల్డ్ పోర్నోగ్రఫీనే కారణమని చాలా సందర్భాల్లో తేలింది. దీంతో పోలీసులు ఇలాంటి వారి క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటున్నారు. కడుపులో ఉన్నదీ ఆడ మగ అని కొంద‌రు వెతుకుతుంటారు. కానీ అవన్నీ చాలా వరకు సైంటిఫిక్ ప్రూఫ్ లేని కంటెంట్. కాకపోతే జనరల్ ఇన్ఫర్మేషన్ కోసం వెతకవచ్చు. అయితే ఏమి తినాలి ఎం తినకూడదు అని నెట్ లో చూసి ఫాలో అవ్వకూడదు అంటున్నారు. సో.. బీకేర్‌ఫుల్‌..!

మరింత సమాచారం తెలుసుకోండి: