ఇటీవ‌ల కాలంలో టిక్ టాక్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో వేరుగా చెప్పనక్కర్లేదు. ఇంతకాలం నాలుగు గోడల మధ్యనే దాగిపోయిన టాలెంట్​ ఇప్పుడిప్పుడే సోషల్​ మీడియా ద్వారా నలుగురికీ తెలుస్తోంది.  ప్రపంచాన్ని చిన్న గ్రామంగా మార్చేసిన సోషల్​ మీడియాని టిక్​టాక్​ యాప్​ ఊపేస్తోంది. క్రమంగా ఇది ఓ వ్య‌స‌నంలా మారిపోయింది. టిక్‌టాక్ యాప్‌లో క్రియేటీవ్‌గా వీడియోలు రూపొందించడం, వాటిని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేయడం, లైకులు, షేర్లు, కామెంట్లు సంపాదించడం మామూలే. 

 

తక్కువ కాలంలోనే తమ ప్రతిభను చాటుకుంటూ నటించే అవకాశాలు పొందిన వారు కూడా ఉంటున్నారు. అనేక రకాల సంఘటనలు సంఘటనలు టిక్ టాక్ ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. సామాన్య ప్ర‌జ‌లు, సిని నటులు రాజకీయ నాయకులు, చిన్న పిల్ల‌లు అందరూ కూడా దీని మీదే ఉంటున్నారు. అయితే ఇలాంటి వారంద‌రికి ఓ గుడ్ న్యూస్ అని చెప్పాలి. మీ టిక్‌టాక్ వీడియోలను మరింత అద్భుతంగా మార్చేందుకు కంపెనీ కొత్త ఫీచర్స్ అందుబాటులోకి తీసుకొస్తోంది. 

 

మెర్లిన్‌తో డీల్ కుదుర్చుకున్న టిక్‌టాక్... సరికొత్త మ్యూజిక్స్‌ని అందించనుంది. దీంతో లక్షలాది లైసెన్స్‌డ్ మ్యూజిక్ ఆడియోలను యాక్సెస్ చేయొచ్చు. వాటిని మీ టిక్‌టాక్ వీడియోస్‌కి కూడా ఉప‌యోగించుకోవచ్చు. టిక్‌టాక్‌లో మ్యూజిక్ క్రియేషన్ దగ్గర్నుంచి ఉపయోగించడం వరకు ఇండిపెండెంట్ ఆర్టిస్టులు, లేబుల్స్ కీలకమని, మెర్లిన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా టిక్‌టాక్ యూజర్లకు సరికొత్త లేబుల్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని టిక్‌టాక్ వెల్ల‌డించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: