దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌‌‌‌టెల్‌  మొట్టమొదటి సారిగా వైఫై కాల్‌ను పరిచయం చెయ్యడంతో, ఇక మీదట మన దేశంలో కాల్ డ్రాప్ అనే మాట వినిపించదు. VoLTE నెట్ వర్క్ నుంచి ఏ వైఫై నెట్ వర్క్‌కు అయినా నేరుగా మారే సదుపాయం కలగడంతో భవనాల్లో కూడా కస్టమర్లు స్పష్టంగా కాల్స్ చేసుకునేందుకు వీలు అవుతుంది. ఎయిర్‌‌‌‌టెల్ వైఫై కాలింగ్ సేవలకు అదనంగా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం డేటా మాత్రమే ఖర్చవుతుంద‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది ఎయిర్‌టెల్‌. 

 

ఈ సేవలను డిసెంబర్‌లో ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు 1.8 మిలియన్లకు పైగా ఎయిర్‌టెల్ కస్టమర్లు ఉపయోగించుకుంటున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద వివిధ నగరాల్లో ప్రారంభించగా మంచి స్పందన లభించింది. కస్టమర్ల సంఖ్య 10 లక్షలను అధిగమించింది. ఆక ఏయే బ్రాండ్స్‌లో వైఫై సౌకర్యం ఉందంటే.. iphone 6S సహా ఆపై అన్ని యాపిల్ ఫోన్లలో వైఫై సౌకర్యం అందుబాటులో ఉంటుంది. శాంసంగ్ S10, S10 , S10e, M20, One Plus 6, 6T, షియోమీ రెడ్‌మి K20, రెడ్‌మి K20 ప్రో, పోకో F1, శాంసంగ్ J6, శాంసంగ్ A10s, శాంసంగ్ On6, శాంసంగ్ M30s, వన్ ప్లస్ 7, వన్ ప్లస్ 7 ప్రో, వన్ ప్లస్ 7T, వన్ ప్లస్ 7T ప్రో లలో వైఫై కాలింగ్ అందుబాటులో ఉంది.

 

వన్ ప్లస్ 7, 7టి, 7 ప్రొ, 7టి ప్రొ, వన్ ప్లస్ 6, 6టి, స్మార్ట్ ఫోన్లలో ఎయిర్ టెల్ ఫ్రీ వైఫై కాలింగ్ ఫీచర్ సౌక‌ర్యం ఉంది. షియోమీ రెడ్‌మి కె20, కె20 ప్రొ, పోకో ఎఫ్‌1, రెడ్‌మి 7ఎ, రెడ్‌మి 7, రెడ్‌మి నోట్ 7 ప్రొ, రెడ్‌మి వై3, పోకో ఎఫ్1 ఫోన్లలో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా, కూల్ ప్యాడ్ బ్రాండ్‌కు చెందిన కూల్ 3, కూల్ 5, నోట్ 5, మెగా 5సి, నోట్ 5 లైట్ లలో ఎయిర్ టెల్ ఫ్రీ వాయిస్ కాల్ సౌక‌ర్యం ఉంది. మ‌రియు అసుస్ బ్రాండ్‌కు చెందిన జెన్ ఫోన్ ప్రొ, జెన్ ప్రొ మ్యాక్స్ లలో కూడా ఎయిర్ టెల్ ఫ్రీ వైఫై కాలింగ్ సౌకర్యం ఉంది. ఇకెందుకు అల‌స్యం వెంట‌నే ఈ సౌక‌ర్యాన్ని మీరు కూడా వినియోగించుకోండి..!

మరింత సమాచారం తెలుసుకోండి: