శాంసంగ్ ప్రియుల‌కు గుడ్ న్యూస్‌.  దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ శాంసంగ్ తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువ‌స్తూనే ఉంటుంది. అయితే ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న గెలాక్సీ ఏ51 స్మార్ట్ ఫోన్ ను శాంసంగ్ ఇండియాలో లాంచ్ చేసింది.  గెలాక్సీ ఏ50కి తర్వాతి వెర్షన్ గా గెలాక్సీ ఏ51 తీసుకువ‌చ్చారు. శాంసంగ్ గెలాక్సీ ఏ51 స్మార్ట్ ఫోన్ ధరను మనదేశంలో రూ.23,999గా నిర్ణయించారు. ఇది 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. దీని ధరను రూ.25,999గా నిర్ణయించారు. 

 

 ఈ ఫోన్ కు సంబంధించిన సేల్ జనవరి 31 నుంచి ప్రారంభం కానుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ51 స్మార్ట్ ఫోన్ లో 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోఎల్ఈడీ ఇన్ ఫినిటీ-ఓ డిస్ ప్లేను అందించారు. ఆక్టాకోర్ ఎక్సినోస్ 9611 ప్రాసెసర్ ను ఇందులో అందించారు. ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీగా ఉంది. మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా దీన్ని 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. అలాగే ఇందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, 12 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఇందులో ఉంది. 

 

సెల్ఫీ కెమెరా సామర్థ్యం 32 మెగా పిక్సెల్ గా ఉంది. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్ లాక్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇక బ్యాట‌రీ విష‌యానికి వ‌స్తే..  4,000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని ఈ స్మార్ట్ ఫోన్ లో అందించారు. మ‌రియు 15 వోల్టేజీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు ఉంటుంది. ఇక బ్లాక్ ప్రిజం క్రష్, వైట్, బ్లూ రంగుల్లో ఇది అందుబాటులో ఉండనుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: