ఇటీవ‌ల ఎవరి పర్సులో చూసినా డెబిట్, క్రెడిట్ కార్డులు తప్పనిసరిగా ఉంటాయి. నగదుకు బదులుగా కార్డులద్వారానే ఎక్కువగా చెల్లింపులు జరుగుతున్న నేటి కాలంలో ఈ కార్డులు తీసుకునేవారు, వాటితో చెల్లింపులు చేసేవారు పెరిగిపోతున్నారు. దీంతో బ్యాంకుల‌కు వెళ్లే ప‌ని లేకుండా సులువుగా ఏటీఎంల వ‌ద్దే డ‌బ్బులు పొందుతున్నారు. అయితే మీకు ఓ అల‌ర్డ్‌..! అంద‌రికీ కాదండోయ్‌.. కేవ‌లం ఈ అల‌ర్డ్‌ పోస్ట్ ఆఫీసులో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న‌వాళ్ల‌కు మాత్ర‌మే. ఎందుకంటే మీరు మీ ఏటీఎం కార్డు మార్చాల్సి ఉంది కాబ‌ట్టి.

 

ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI తమ కస్టమర్లకు ఈఎంవీ చిప్ కార్డుల్ని అందించింది. మ్యాగ్నెటిక్ స్ట్రైప్ డెబిట్ కార్డుల్ని బ్లాక్ చేసింది. అదే త‌ర్హాలో ఇప్ప‌డు  ఇండియా పోస్ట్ కూడా చేస్తోంది.మీ దగ్గర మ్యాగ్నెటిక్ స్ట్రైప్ ఏటీఎం కార్డు ఉన్నట్టైతే వాటిని మార్చుకొని ఈఎంవీ చిప్ ఉన్న ఏటీఎం కార్డు తీసుకోవాలి. ఏటీఎం కార్డుల్ని మార్చడానికి 2020 జనవరి 31 చివరి తేదీ. 2020 ఫిబ్రవరి 1 నుంచి మ్యాగ్నెటిక్ స్ట్రైప్ ఏటీఎం కార్డు పనిచేయదు.

 

సో.. మ్యాగ్నెటిక్ స్ట్రైప్ ఏటీఎం కార్డు ఉంటే మీ అకౌంట్ ఉన్న పోస్ట్ ఆఫీస్‌కు వెళ్లి ఈఎంవీ చిప్ కార్డు కోసం దరఖాస్తు చేయాలి. ఇక bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  గైడ్ లైన్స్ ప్రకారం కస్టమర్లకు తప్పనిసరిగా ఈఎంవీ చిప్ ఉన్న ఏటీఎం కార్డుల్నే ఇవ్వాలి. అందుకే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లంతా ఈఎంవీ చిప్ ఉన్న ఏటీఎం కార్డు తీసుకోవాలని పోస్టల్ డిపార్ట్‌మెంట్ కోరుతోంది. అందుకే లేట్ చేయ‌కుండా వెంట‌నే మీ ఏటీఎం కార్డును మార్చుకోండి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: