యాపిల్ ఐఫోన్ అంటే మీకెంత ఇష్టం అంటే చచ్చేంత ఇష్టం అనే జవాబు వస్తే ఆశ్చర్యం లేదు. అయితే ఐఫోన్ అంటే అందరికీ ఇష్టం ఉన్నప్పటికీ.. ఆ ఫోన్ అధిక ధరను కలిగి ఉన్న కారణంగా సామాన్యులకు ఇది చేరువ కాలేకపోతుంది. కంప్యూటర్ ఉత్పత్తుల తయారీలో ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్‌ను ఏర్పరుచుకున్ను 'యాపిల్' వివిద దేశాల్లో అందిస్తున్న స్మార్ట్‌ఫోన్ 'ఐఫోన్‌' ఇకపై అందరికీ అందుబాటులో ఉండేలా చేస్తుంది. ఇక ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే కొత్త ఐఫోన్ కొనేవాళ్లు కొన్ని విష‌యాలు ఖ‌చ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మ‌రి అవేంటో ఓ లుక్కేసేయండి.

 

కొత్త ఐఫోన్ కొన్న‌ప్పుడు మీ పాత ఐఫోన్‌లోని డేటాను కొత్త ఐఫోన్‌లోకి బ్యాకప్ చేసుకోవాలంటే ఫోన్ సెట్టింగ్స్‌.. ఐక్లౌడ్‌.. బ్యాక‌ప్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే పాత ఐఫోన్‌లోని డేటాను కొత్త ఐఫోన్‌లోకి బ్యాకప్ కాబడుతుంది. మీ ఐఫోన్‌లోని ఐక్లౌడ్ ఫీచర్‌ను కాన్ఫిగర్ చేసుకోవటం ద్వారా ఫోన్ డేటాను ఎప్పటికప్పుడు యాపిల్ సర్వర్‌లో భద్రపరుచుకునే వీలుటుంది. ఇక వాస్త‌వానికి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే యాపిల్ ఐఫోన్లు చాలా భిన్నంగాను ఇదే సమయంలో చాలా ప్రొఫెషనల్‌గాను అనిపిస్తాయి.

 

కొత్త ఐఫోన్ కొనుగోలు చేసిన వారు వెంట‌నే యాపిల్ ఐడీని క్రియేట్ చేసుకోవటం. యాపిల్ ఐఫోన్‌లను వినియోగించే ప్రతిఒక్కరూ mandatoryగా యాపిల్ ఐడీని తమ పేరుమీద క్రియేట్ చేసుకోవల్సి ఉంటుంది. యాపిల్ ఐడీని క్రియేట్ చేసుకోని పక్షంలో యాపిల్ స్టోర్‌ నుంచి యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవటం కుదరదు. అలాగే యాపిల్ ఐడీని క్రియేట్ చేసుకోవటంతో పాటు ఐట్యూన్స్‌ యాప్‌ను మీ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఫోన్‌ను ఎప్పటికప్పుడు కంప్యూటర్‌కు కనెక్ట్ చేసుకుని మీ ఫోన్‌లోని మ్యూజిక్ అలానే వీడియో డేటాను కంప్యూటర్‌లో సేవ్ చేసుకునే వీలుంటుంది.

    

మరింత సమాచారం తెలుసుకోండి: