చైనా దేశంలో ప్రబలిన కరోనా వైరస్ మన దేశంలోనూ కలకలం సృష్టిస్తోంది. జలుబు చేస్తే చాలు కరోనా వైరస్ అని భయపడే పరిస్థితి వచ్చింది. నిన్న, మొన్నటి వరకు భయపెట్టిన స్వైన్‌ ఫ్లూ కాస్త తగ్గుముఖం పట్టగానే కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. గత కొంతకాలంగా చైనాను భయపెడుతున్న ఈ వైరస్ క్రమంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. రోజు రోజుకి కరోనా వైరస్ కాటేసిన వారి సంఖ్య పెరిగిపోతోంది. శరవేగంగా ఇతర దేశాలకు విస్తరిస్తోంది. ఇదిలా ఉంటే.. క‌రోనా వైర‌స్ ఎఫెక్ట్ ఇప్పుడు  గేమింగ్ స్మార్ట్ ఫోన్ అసుస్ రోగ్ ఫోన్ 2పై ప‌డింది.

 

ఆసియాలో ప్రస్తుతం ఉన్న మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా రోగ్ ఫోన్ 2 సప్లైకి ఇబ్బందులు ఎదురైనట్లు అసుస్ తెలిపింది. దీంతో ప్రస్తుతం మనదేశంలో ఈ ఫోన్ అందుబాటులో లేదు. తిరిగి అందుబాటులోకి ఎప్పుడు వస్తుందనే విషయంపై క్లారిటీ లేదు. ఇప్పటివరకు నిరంతరాయంగా ఈ ఫోన్ ను కొనుగోలు చేసేవారి వద్దకు చేర్చినప్పటికీ ప్రస్తుతం ఆసియాలో నెలకొన్న పరిస్థితి కారణంగా సప్లైని నిలిపివేస్తున్నామని అసుస్ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. చైనాలో, ఇతర ప్రాంతాల్లో పరిస్థితి ఎప్పటికి అదుపులోకి వస్తుందో దాన్ని బట్టి ఈ సప్లైని పునరుద్ధరిస్తామని అసుస్ పేర్కొంది.

 

ప్రస్తుతానికి అసుస్ రోగ్ ఫోన్ 2 ఫ్లిప్ కార్ట్ లో అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తుంది. తిరిగి సేల్ కు ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని కూడా అసుస్ తెలపలేదు. అయితే ఈ కరోనా వైరస్ ద్వారా ఎఫెక్ట్ అయిన బ్రాండ్లలో కేవలం అసుస్ మాత్రమే కాదు చాలా బ్రాండ్లు ఉన్నాయి. యాపిల్ కూడా చైనాలో తన కార్పొరేట్ ఆఫీస్ లు, స్టోర్లు, కాంటాక్ట్ సెంటర్లను ఫిబ్రవరి 9వ తేదీ వరకు మూసివేసింది. 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: