ఇటీవ‌ల కాలంలో ఫోన్లు, కంప్యూట‌ర్ల  వినియోగం విప‌రీతంగా పెరిగిపోయిన సంగ‌తి తెలిసిందే. ఏది ఉన్నా లేక‌పోయినా ప్ర‌స్తుత స‌మాజంలో ప్ర‌తి ఒక్క‌రికి స్మార్ట్‌ఫోణ్ చాలా ముఖ్యం అయిపోయింది. ఇక ఫోన్ అన్నాక ఏదో ఒక నోటిఫికేష‌న్ వ‌స్తూనే ఉంటాయి. అయితే ఒక్కో సంద‌ర్భంలో మ‌నం కంప్యూట‌ర్‌లో వ‌ర్క్ చేసేట‌ప్పుడు ఫోన్‌లో నోటిఫికేష‌న్స్ వ‌స్తుంటారు. కాని, అవి చూసే తీరిక లేక కొంద‌రు చూడరు. దీంతో తమ ఫోన్‌కు వచ్చే నోటిఫికేషన్స్‌ను కంప్యూటర్‌లోకే వ‌స్తే చాలా బాగుంటుంద‌ని అనుకునేఉంటారు. 

 

అయితే విండోస్ 10 అప్‌డేట్‌తో విండోస్ యూజర్లు తమ ఫోన్‌కు వచ్చే నోటిఫికేషన్స్‌ను కంప్యూటర్‌లో ఎలా చూడాలో తెలుసుకుందాం. ముందుగా ఇన్‌కమ్మింగ్ కాల్ నోటిఫికేషన్ ఫీచ‌ర్ ను మీ విండోస్ 10 డివైస్‌లో ఎనేబుల్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ సదుపాయాన్ని యాక్టివేట్ చేసుకోవటం ద్వారా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌కు వచ్చే ప్రతి నోటిఫికేషన్ మీ డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ స్ర్కీన్ పై కనిపిస్తుంది. మ‌రి ఇన్‌కమ్మింగ్ కాల్ నోటిఫికేషన్ ఫీచర్ ను యాక్టివేట్ చేసుకునే ప్రొసీజర్ ను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా Cortana appను గూగుల్ ప్ల స్టోర్ నుంచి మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాలేషన్ పూర్తి చేయండి. 

 

యాప్ ఫోన్‌లో లాంచ్ అయిన తరువాత hamburger ఐకాన్ పై టాప్ చేసి సెట్టింగ్స్ విభాగంలోకి వెళ్లండి. సెట్టింగ్స్ విభాగంలో Cortana Settingsను ఓపెన్ చెయ్యండి. సింక్ నోటిఫికేషన్స్ పై టాప్ ఇచ్చి మిస్సుడ్ కాల్, ఇన్‌కమ్మింగ్ కాల్, ఇన్‌కమ్మింగ్ మెసేజ్, లో బ్యాటరీ ఇంకా యాప్ నోటిఫికేషన్‌లను టర్న్ ఆన్ చేసుకోండి. మీ విండోస్ పీసీలోని Cortana యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ మెనూ ఓపెన్ అయిన తరువాత డివైసెస్ మధ్య నోటిఫికేషన్స్‌ను టర్న్ ఆన్ చేసుకుంటే స‌రిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: