బెంగుళూరు లోని కొన్ని ప్రాంతాల్లో ప్రముఖ టెలికామ్ రంగ  సంస్థ  వోడాఫోన్  సిగ్నల్స్ నిలిచిపోయాయి.  దాంతో కస్టమర్లు  సోషల్ మీడియా వేదిక గా కంప్లైట్స్ చేస్తున్నారు.  గత 4గంటల నుండి ఇందిరా నగర్ తదితర ప్రాంతాల్లో వోడాఫోన్  నెట్వర్క్ డౌన్ అయ్యింది. దాంతో  కాల్స్ , మెసేజ్ చేసుకునేందుకు వీలు లేకపోవడంతో వినియోగదారులు ,వోడాఫోన్ మినీ స్టోర్ల వద్దకు వెళ్లి ఆరా తీస్తున్నారు.  ఇక ఈ కంప్లైంట్స్ పై స్పందించిన  వోడాఫోన్..  ఇది తాత్కాలిక సమస్యే దాన్ని పరిష్కరించాం..ఇంకా యూజర్లు ఎవరైనా ఇదే సమస్యను ఎదుర్కొంటే వెంటనే మీ ఫోన్ ను  రీ స్టార్ట్ చేసుకోవాల్సిందిగా సూచించింది. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్  డ్యామేజ్ కావడం వల్లే ఈ సమస్య ఏర్పడినట్లు సమాచారం. 
 
ఇదిలా ఉంటే ఒకప్పుడు  దేశంలో నెంబర్ వన్ టెలికామ్ నెట్ వర్క్ సంస్థ గా వెలుగొందిన వోడాఫోన్  జియో రాక తో కుదేలైయింది.  ఆతరువాత  ఐడియా ను చేజిక్కించుకొని  ప్రస్తుతం ఇండియా లో వోడాఫోన్ మూడో స్థానంలో వుంది. కాగా జియో , ఎయిర్ టెల్ మొదటి, రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: