స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం పెరగటంతో సోషల్ మీడియా యాప్‌ల వినియోగం కూడా అదే స్థాయిలో పెరిగింది. ముఖ్యంగా ఫేస్‌బుక్‌, ట్విటర్లతో పాటు ఇన్‌స్టాగ్రామ్‌ కూడా జెట్‌ స్పీడుతో దూసుకుపోతోంది. ఎప్పటికప్పుడు యూజర్లకు మెరుగైన ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు సరికొత్త ఫీచర్స్‌ను జత చేస్తూ కస్టమర్స్‌ను మరింతగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది సెలబ్రిటీలు తమ అభిమానులకు అందుబాటులో ఉండేదుకు ఇన్‌స్టాగ్రామ్‌ను వాడుతున్నారు. రెగ్యులర్‌గా తమ ఫోటోలతో పాటు ఇతర పర్సనల్‌ విషయాలను కూడా ఈ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ద్వారా అభిమానులకు తెలియజేస్తున్నారు.

 

అందులో భాగంగా తాజాగా మరో అప్‌డేట్‌ను తీసుకువచ్చింది ఇన్‌స్టాగ్రామ్‌. ఈ అప్‌డేట్‌లో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ పోస్ట్‌లను తక్కువ వీక్షించేవారు, ఫాలో అయ్యే వాళ్లను గుర్తించి అన్‌ఫాలో చేసేందుకు వెసులుబాటు కల్పించనుంది. ఈ ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ త్వరలో ప్రవేశపెట్టనుంది. ఈ ఫీచర్‌ యూజర్లకు తమతో ఎక్కువగా ఇంటరాక్ట్‌ అయ్యే గ్రూప్‌ను సార్ట్‌ చేసేందుకు, యాక్టివ్‌గా లేని ఫాలోయర్లను అవాయిడ్‌ చేయటం మరింత సులువు కానుంది.

 

అంతేకాదు మీ పోస్ట్‌లను ఏయే ఇన్‌స్టా ఖాతాలు చురుకుగా పరిశీలిస్తున్నాయి. మీతో ఎవరు ఎక్కువగా ఇంటరాక్ట్‌ అవుతున్నారు. ఏ అకౌంట్‌లను అన్‌ ఫాలో చేయవచ్చు అనే అంశాలన్నింటినీ యూజర్లు ఈ ఫీచర్‌ ద్వారా మేనేజ్‌ చేసుకోవచ్చని ఇన్‌స్టా నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు.

 

ఈ తాజా ఫీచర్‌ గురించి వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ సీఈఓ ఆడమ్‌ ముసోరి ఓ ట్వీట్‌ చేశారు. తాజా ఫీచర్‌తో అవసరమైన ఫీడ్‌ను మాత్రమే యూజర్‌ ఎక్కువ సేపు చూసే అవకాశం ఉంది. దీంతో యూజర్‌ యాప్‌లో ఎక్కువ సేపు సమయం గడుపుతాడని, వ్యూస్‌ కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని ఇన్‌స్టా మేనేజ్మెంట్‌ భావిస్తోంది. అయితే ఈ కొత్త ఫీచర్‌ను యూజర్లు ఎలా రిసీవ్ చేసుకుంటారన్న విషయం మాత్రం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: